Bigg Boss 6 Telugu 89 Episode: కప్ గెలుస్తానని అమ్మకు మాటిచ్చానన్న శ్రీహాన్ - రోహిత్‌కు అన్యాయం
Bigg Boss 6 Telugu 89 Episode: బిగ్‌బాస్ టికెట్ టూ ఫినాలే రేసులో నిలిచే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారుతోంది. వివిధ టాస్క్‌లతో ఫినాలే రేసులో నిలిచేందుకు కంటెస్టెంట్స్ పోటీపడుతోన్నారు. ఈ టికెట్ టూ ఫినాలే పోటీలోఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్ టాప్ ప్లేస్‌లో నిలిచారు.
Bigg Boss 6 Telugu 89 Episode: బిగ్‌బాస్ ట్రోఫీ గెలవాలని ఎందుకు అనుకుంటున్నారనే విషయంలో కంటెస్టెంట్స్ తమ మనసులోని మాటలు వెల్లడించారు. ఎమోషనల్ అయ్యారు. అంతకుముందు టికెట్ టూ ఫినాలే రేస్‌లో నిలిచే నలుగురు కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో జరుగనున్న తదుపరి టాస్క్‌లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఏకాభిప్రాయంతో డిసైడ్ చేసుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో ఈ సారి గొడవలు పడకుండా ఫెయిర్‌గా డెసిషన్ తీసుకోవాలని ఆదిరెడ్డి కొత్త ప్రపోజల్ పెట్టాడు. ఒక్కో టాస్క్‌లో ఒక్కొక్కరు తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
రోల్ బేబీ రోల్
రోల్ బేబీ రోల్ అనే టాస్క్ నుంచి రేవంత్, ఆదిరెడ్డి తప్పుకున్నారు. ఈ టాస్క్‌కు శ్రీసత్య, ఇనాయా సంచాలక్‌గా వ్యవహరించారు. ఇందులో విన్నర్ ఎవరనే విషయంలో రోహిత్‌కు సంచాలక్‌లు అన్యాయం చేశారు. శ్రీహాన్‌ను విన్నర్‌గా ప్రకటించారు. సెకండ్ ప్లేస్‌లో రోహిత్ నిలిచినట్లు తెలిపారు.
మరోసారి శ్రీసత్య, ఇనాయా నిర్ణయం పట్ల కీర్తి అప్‌సెట్ అయ్యింది. ఇనాయా పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. నచ్చిన వాళ్లనే విన్నర్స్‌గా ప్రకటిస్తున్నారని, కావాలనే శ్రీహాన్‌ను విన్నర్‌గా ప్రకటించినట్లు కామెంట్స్ చేసింది. కోపంతో తాను పెట్టిన బ్రిక్స్‌ను తన్ని వెళ్లిపోయింది.
కీర్తి రిక్వెస్ట్...
ఒక్కసారి తనను కన్ఫేషన్ రూమ్‌కు పిలవమని బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేసింది. ఈ టాస్క్ తర్వాత 10 పాయింట్లతో శ్రీహాన్ టాప్ ప్లేస్‌లో నిలవగా ఆదిరెడ్డి, రేవంత్ సెకండ్, థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. లాస్ట్ ప్లేస్‌లో ఉన్న కీర్తి టికెట్ టూ ఫినాలే రేసు నుంచి తొలగిపోయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.
గుడ్డు జాగ్రత్త...
టికెట్ టూ ఫినాలే తదుపరి ఛాలెంజ్‌లో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తదుపరి టాస్క్‌లో ఫైమా, శ్రీహాన్ తొలగిపోవాలని అనుకున్నారు. కానీ ఫైమా మాత్రం టాస్క్ నుంచి తప్పుకోవడానికి అంగీకరించలేదు. రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్ కలిసి గుడ్డు జాగ్రత్త అనే టాస్క్ ఆడారు. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి విన్నర్‌గా నిలిచాడు. తొలుత ఆటలో తడబడిన రేవంత్ చివరలో బాగా ఆడాడు. టాస్క్ ముగిసే సరికి ఆదిరెడ్డి ఫస్ట్ ప్లేస్‌లో, శ్రీహాన్, రేవంత్ సెకండ్, థర్డ్ ప్లేస్‌లో నిలిచారు.
అమ్మకు మాట ఇచ్చా...
బిగ్‌బాస్ ట్రోఫీ గెలవాల్సిన ప్రాముఖ్యత ఏమిటని కంటెస్టెంట్స్‌ను అడిగాడు. ఈ బిగ్‌బాస్ హౌజ్‌లో చాలా నేర్చుకున్నానని, తప్పులు తెలుసుకున్నానని శ్రీహాన్ అన్నాడు. అమ్మకు ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. కప్ గెలిచి నాన్న పేరు నిలబెట్టాలని ఉందని రోహిత్ అన్నాడు. డే వన్ టాస్క్ నుంచి ఇప్పటివరకు ఆడకుండా ఉండలేదని, ఎన్ని అవాంతరాలు వచ్చిన ముందుకు వెళుతున్నానని కప్ గెలుస్తానని రేవంత్ అన్నాడు. కప్ గెలిచి అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలవాలని ఉందని ఫైమా పేర్కొన్నది.