Bigg Boss 6 Telugu Episode 81: హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా, శ్రీసత్య ఫ్యామిలీ మెంబర్స్
Bigg Boss 6 Telugu Episode 81: బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఫైమా మదర్‌తో పాటు శ్రీసత్య తల్లిదండ్రులు వచ్చారు. వారిని చూసి హౌజ్‌మేట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు.
Bigg Boss 6 Telugu Episode 81:బిగ్‌బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇవ్వడంతో బుధవారం ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. ఫైమా మదర్ షాహిదా హౌజ్‌లోకి సెలైంట్‌గా అడుగుపెట్టి అందరిని సర్‌ప్రైజ్ చేసింది.
తనకు ఇంగ్లీష్ నేర్పించమని ఫైమాను ఆమె తల్లి కోరింది. కూతురు వల్ల తమ ఫ్యామిలీకి పేరు రావడం ఆనందంగా ఉందని తెలిసింది. ఫైమాతో తో పాటు హౌజ్‌లోని అందరూ తనకు ఇష్టమేనని చెప్పింది. రేవంత్‌పై పంచ్‌లు వేసి అందరిని నవ్వించింది.
శ్రీసత్యతో జాగ్రత్త...
ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఎవరికి ఇవ్వొద్దని ఫైమాకు చెప్పింది. శ్రీసత్య ముందు ఒకటి, వెనకాల మరొకటి మాట్లాడుతుందని ఆమెతో జాగ్రత్తగా ఉండమని కూతురుని హెచ్చరించింది. నామినేషన్స్ సమయంలో ఆలోచించి మాట్లాడమని చెప్పింది.
వెటకారం తగ్గించుకోమని, అప్పుడే జనాలకు నచ్చుతావని ఫైమాకు సూచించింది. ఆదిరెడ్డితో కలిసి కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా అనే పాటకు ఫైమా మదర్ డ్యాన్స్ చేసింది. ఫైమాతో పాటు ఆమె తల్లి చేస్తోన్న డ్యాన్స్ చూసి కీర్తి ఎమోషనల్ అయ్యింది. ఏడుస్తూ బాత్‌రూమ్‌లోకి వెళ్లిపోయింది. శ్రీసత్య కూడా తన మదర్‌ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నది.
ఫ్రీజ్ గేమ్...
ఆ తర్వాత కంటెస్టెంట్స్‌తో ఫ్రీజ్ గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. ఫ్రీజ్ అయిన రాజ్‌అమ్మాయి మాదిరిగా ఇనాయా, ఫైమా తయారుచేశారు. రిలీజ్ అయిన శ్రీసత్య...శ్రీహాన్‌ను కొట్టడానికి వచ్చింది. శ్రీహాన్ ఫ్రీజ్ కావడంతో అతడికి ఆడపిల్ల మాదిరిగా కుర్తా వేసి అలంకరించింది శ్రీసత్య, ఫైమా.
ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి శ్రీసత్య మదర్ వచ్చింది. తల్లిదండ్రులను చూడగానే శ్రీసత్య కన్నీళ్లు పెట్టుకున్నది. అమ్మకు అన్నం తినిపించింది. కోపం తగ్గించుకోమని శ్రీసత్యకు ఆమె తండ్రి చెప్పాడు. ఇదివరకు చాలా పొలైట్‌గా ఉండేదానివని అన్నాడు. అప్పుడే కప్ కొడతావని పేర్కొన్నాడు.