Bigg Boss 6 Telugu 74th Episode: శ్రీహాన్‌ను కుక్కతో పోల్చిన కీర్తి- ఇనాయాపై రాజ్ రివేంజ్
Bigg Boss 6 Telugu 74th Episode: ఈ వారం బిగ్‌బాస్ కెప్టెన్‌గా ఎవరు ఎంపికవుతారన్నది ఆసక్తికరంగా మారింది. బుధవారం కెప్టెన్ పోటీదారుల కోసం ఇచ్చిన టాస్క్ హౌజ్‌మేట్స్ వాదనలతో ఆసక్తికరంగా సాగింది.
Bigg Boss 6 Telugu 74th Episode: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ హౌజ్‌మేట్స్ గొడవలు, వెన్నుపోట్లతో ఆసక్తికరంగా సాగింది. అంతకుముందు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందో ఊహించమని శ్రీసత్యను కోరాడు ఆదిరెడ్డి. ఆమె కీర్తి పేరు చెప్పింది. శ్రీసత్య మాటలతో ఆదిరెడ్డి ఏకీభవించాడు.
ట్రెండింగ్ వార్తలు
కీర్తి ఇంటి నుంచి వెళ్లిపోతుందని తాను అనుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారుల కోసం బీబీ ట్రాన్స్‌పోర్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. బీబీ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ ఆగిన వెంటనే ఎక్కిన వారికే కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనే అర్హత ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. బస్ ఎక్కలేని వారు కంటెస్టెంట్స్‌లో కెప్టెన్ పోటీకి అర్హులు కానీ ఇద్దరి సభ్యులను ఏకాభిప్రాయంతో ఎంపికచేయాలని బిగ్‌బాస్ ఇచ్చాడు.
రాజ్‌పై ఇనాయా ఫైర్
ఫస్ట్ రౌండ్‌లో రాజ్, రేవంత్ పేర్లను ఇనాయా చెప్పింది. ఏకాభిప్రాయం పేరుతో ఇదివరకు తనను బలిపశువును చేశారని, అనవసరపు త్యాగాలతో కంటెస్టెంట్స్ గేమ్ ఆడటం లేదని రేవంత్ ఆమెపై సీరియస్ అయ్యాడు. మధ్యలో రాజ్ కలుగజేసుకున్నాడు. కానీ అతడు చెప్పిన మాటలు ఇనాయా వినలేదు. దాంతో రాజ్ గట్టిగా అరిచాడు. అరిచి మీద పడిపోతున్నావు. అరవడానికే బిగ్‌బాస్‌కు వచ్చావా అంటూ రాజ్‌పై ఇనాయా ఫైర్ అయ్యింది.
రోహిత్, రేవంత్ పేర్లను ఫైమా చెప్పింది. శ్రీసత్య...రాజ్, కీర్తి పేర్లను పేర్కొన్నది. రాజ్...రోహిత్, ఇనాయా పేర్లను సూచించాడు. హౌజ్‌ను హ్యాండిల్ చేసే కెపాసిటీ ఇనాయాలో లేదని చెప్పి ఇనాయాపై రాజ్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఇనాయా బిహేవియర్ బాగాలేదని అన్నాడు. ఫైమా, ఇనాయా పేర్లను రేవంత్ పేర్కొన్నాడు. వారిద్దరు వీక్ అన్నాడు. శ్రీహాన్ కెప్టెన్ కావడం ఇష్టం లేదని కీర్తి చెప్పింది. అతడే తన టార్గెట్ అని పేర్కొన్నది. అతడిని కుక్కతో పోల్చింది. ఫైమా, శ్రీహాన్ కెప్టెన్ కావడానికి అనర్హులని మరీనా చెప్పింది.
ఫైమా అనర్హురాలు...
ఫస్ట్ రౌండ్‌లో రోహిత్, ఫైమాను సెలెక్ట్ చేశారు. కానీ రోహిత్ ఒక్కసారి కూడా కెప్టెన్ కాకపోవడంతో అతడిని మినహాయించి ఫైమాను పక్కనపెట్టారు. సెకండ్ రౌండ్‌లో రాజ్, రేవంత్ అనర్హులుగా సెలెక్ట్ అయ్యారు. కష్టాల్లో ఉన్న అమ్మాయిలకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు వాళ్లే తనను బ్లేమ్ చేస్తున్నారని శ్రీహాన్ అన్నాడు.
చివరకు అందులో రాజ్‌ను పక్కనపెట్టారు. మూడో రౌండ్‌లో శ్రీసత్య, శ్రీహాన్‌ను అందరూ ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేశారు. అందులో శ్రీసత్యను పక్కనపెట్టి శ్రీహాన్‌ను కొనసాగించారు. లాస్ట్ రౌండ్‌లో కీర్తి, మరీనా, ఇనాయా మిగిలిపోయారు. ఈ ముగ్గురిలో ఎవరూ కెప్టెన్సీ టాస్క్‌లో ఉండాలో డిసైడ్ చేసుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇందులో కీర్తి, మరీనా తప్పుకోగా ఇనాయా కెప్టెన్సీ రేసులో నిలిచింది.
ఫీలైన రేవంత్..
శ్రీహాన్, శ్రీసత్య కారణంగా తాను ఆటలో అరటిపండు అయ్యానని రేవంత్ ఫీలయ్యాడు. అది అతడి అభిప్రాయమేనని, తాము ఎప్పుడూ అలా అనుకోలేదని శ్రీహాన్ చెప్పాడు. శ్రీహాన్‌తో నేను ఎక్కువగా మాట్లాడవద్దని అంటున్నావా రేవంత్ అని శ్రీసత్య అతడిని అడిగింది. గొడవ ముదిరిపోవడంతో రేవంత్ అక్కడినుంచి వెళ్లిపోయాడు.