Bigg Boss 10th Week Voting Results: పదో వారం రేవంత్‌కు అత్య‌ధిక ఓట్లు - ఎలిమినేష‌న్ డేంజ‌ర్‌లో వాసంతి, మ‌రీనా-bigg boss 6 telugu 10th week voting results revanth and inaya gets highest voting percentage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss 6 Telugu 10th Week Voting Results Revanth And Inaya Gets Highest Voting Percentage

Bigg Boss 10th Week Voting Results: పదో వారం రేవంత్‌కు అత్య‌ధిక ఓట్లు - ఎలిమినేష‌న్ డేంజ‌ర్‌లో వాసంతి, మ‌రీనా

Nelki Naresh Kumar HT Telugu
Nov 12, 2022 07:03 AM IST

Bigg Boss 10th Week Voting Results: బిగ్‌బాస్ 6 తెలుగు ప‌దో వారం ఓటింగ్‌లో రేవంత్ టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా ఇనాయా రెండో స్థానాన్ని ద‌క్కించుకొంది. అతి త‌క్కువ ఓటింగ్‌ను పొందిన మ‌రీనా, వాసంతిల‌లో ఒక‌రు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

రేవంత్
రేవంత్

Bigg Boss 10th Week Voting Results: బిగ్‌బాస్ ప‌దో వారం ఓటింగ్ రిజ‌ల్ట్‌లో రేవంత్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అత‌డి త‌ర్వాత ఇనాయా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ బిగ్‌బాస్ సీజ‌న్ ఆరంభం నుంచి రేవంత్ ప్ర‌తి టాస్క్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే అత‌డి అగ్రెసివ్ బిహేవియ‌ర్‌పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నాగార్జున చాలా సార్లు ఈ విష‌యంపై రేవంత్‌ను మంద‌లించారు. అయినా అత‌డిలో మార్పు పెద్ద‌గా రాలేదు.

కానీ గ‌త వారం మాత్రం రేవంత్ పూర్తిగా కామ్‌గా క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేశాడు. త‌న‌పై అంద‌రూ నోరు పారేసుకున్నా ఎవ‌రికి ఎదురుచెప్ప‌లేదు. గొడ‌వ‌ల‌కు దిగ‌లేదు. పూర్తిగా సెలైంట్ అయిపోయాడు. నాగ‌మ‌ణి, వ‌స్తా నీ వెనుక టాస్క్‌ల‌లో రేవంత్‌తో ఆదిరెడ్డి, ఫైమా, వాసంతి, శ్రీస‌త్య, కీర్తి గొడ‌వ‌ప‌డ్డారు. ఈ గ‌లాటాలో రేవంత్ వెన‌క్కి త‌గ్గాడు. వ‌స్తానీ వెనుక టాస్క్‌లో రేవంత్ ను ఉద్దేశించి రోహిత్ నోరుజారాడు. అయినా రేవంత్ వెళ్లి అత‌డికి స్వారీ చెప్పాడు.

రేవంత్‌లో మార్పును ఆడియెన్స్ ఊహించ‌లేదు. ఈ మార్పు కార‌ణంగా సింప‌థీ ఓట్లు బాగానే ప‌డ్డాయి. ప‌దో వారం రేవంత్‌కు 2460 ఓట్లు (21.8 %) ఓట్లు ప‌డ్డాయి. అత‌డే టాప్ ప్లేస్‌లో నిలిచాడు. త‌ప్పొప్పుల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ఇనాయా కూడా గేమ్‌లో యాక్టివ్‌గా క‌నిపిస్తోంది. త‌న నోటికి ఎప్పుడూ ప‌నిచెబుతూ వ్యూయ‌ర్స్‌ను అట్రాక్ట్ చేసే ప‌నిలో ప‌డ్డ‌ది. కొన్నిసార్లు మాట‌ల విష‌యంలో హ‌ద్దులు దాటడం ఆమెకు మైన‌స్‌గా మారుతోంది.

హౌజ్ మొత్తం త‌న‌ను వ్య‌తిరేకిస్తున్నా సింగిల్‌గానే అంద‌రితో పోటీప‌డుతోంది. ఈ సారి ఓటింగ్‌లో ఇనాయా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఆమెకు 2319 ఓట్లు వ‌చ్చాయి. బిగ్‌బాస్ హౌజ్‌లో స్ట్రాట‌జిక్‌గా గేమ్ ఆడుతోన్న శ్రీహాన్‌కు ప‌దో వారం ఓటింగ్‌లో మూడో స్థానంలో నిలిచాడు. అత‌డికి 1374 ఓట్లు వ‌చ్చాయి.

1304 ఓట్ల‌తో ఆదిరెడ్డి నాలుగో స్థానంలో నిల‌వ‌గా కీర్తి, ఫైమా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. కీర్తికి 825 ఓట్లు రాగా ఫైమాకు 797 ఓట్లు ప‌డ్డాయి. బాలాదిత్య 785, రోహిత్ మ‌రీనాల‌కు 780 ఓట్లు వ‌చ్చాయి. ఓటింగ్‌లో చివ‌రి ప్లేస్‌లో వాసంతి నిలిచింది. ఆమెకు 641 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈ వారం ఎలిమినేష‌న్స్‌లో మ‌రీనా, వాసంతి ఉన్నారు. ఓటింగ్ ప‌రంగా మ‌రీనా, వాసంతి చివ‌రి స్థానాల్లో ఉండ‌టంతో ఈ ఇద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

IPL_Entry_Point