Bigg Boss 6 Telugu 101 Episode: రోహిత్‌కు వైఫ్ మరీనా ఫోన్ కాల్ - ఆదిరెడ్డిపై బిగ్‌బాస్ ప్రశంసలు
Bigg Boss 6 Telugu 101 Episode: ఆదిరెడ్డి, రోహిత్‌పై బిగ్‌బాస్ ప్రశంసలు కురిపించాడు. ఆదిరెడ్డిది మాట పడని స్వభావమని చెప్పాడు. రోహిత్ మంచితనాన్ని చాలా మంచి వాడుకున్నా అతడు మాత్రం వారికి చెడు చేయలేదని తెలిపాడు.
Bigg Boss 6 Telugu 101 Episode: బిగ్‌బాస్ బుధవారం ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. బిగ్‌బాస్ మాటలతో ఆదిరెడ్డి, రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలుత ఆదిరెడ్డిని గార్డెన్ ఏరియాకు రమ్మని బిగ్‌బాస్ పిలిచాడు. బిగ్‌బాస్ పిలుపును ఉద్దేశించి వెరీ ఎమోషనల్ మూవ్‌మెంట్ ఆఫ్ మై లైఫ్ అంటూ ఆదిరెడ్డి పేర్కొన్నాడు.
బిగ్‌బాస్ జర్నీని గుర్తుచేసే ఫొటోలు గార్డెన్ ఏరియాలో కనిపించడంతో ఆదిరెడ్డి వాటిని చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. అతడికి భార్య కవిత నుంచి ఫోన్ వచ్చింది. కామన్ మెన్ తలచుకుంటే ఏదైనా చేయగలని నిరూపించబోతున్నవని చెప్పింది. భార్య మాటలతో కన్నీళ్లను అదిమిపెట్టుకుంటూ ఆదిరెడ్డి పోడియంపై నిలిచాడు.
మాట పడని స్వభావం...
బిగ్‌బాస్ రివ్యూవర్‌గా జర్నీ మొదలుపెట్టి కంటెస్టెంట్‌గా ఆదిరెడ్డి నిలిచాడని బిగ్‌బాస్ అతడిప్రశంసించాడు. . హౌజ్‌లో అతడిలోని స్ట్రాటజీ మాస్టర్ చురుకుగా మారాడని పేర్కొన్నాడు. ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆది చూస్తాడని, అందుకే అతడు ఆటలో ఒక అడుగు ముందున్నాడని బిగ్‌బాస్ చెప్పాడు.
కొన్ని సార్లు అంచనాలు తప్పి నష్టపోయాడని అన్నాడు. మాట పడని స్వభావం, మాట ఎలా అనాలో తెలిసిన నేర్పరితనం ఆదిరెడ్డి సొంతం అని ప్రశంసించాడు. ఆదిరెడ్డికి అతడి జర్నీని బిగ్‌బాస్ చూపించాడు. జర్నీని చూసి చాలా ఆనందంగా ఉన్నట్లు ఆదిరెడ్డి చెప్పాడు. బిగ్‌బాస్ లేకపోతే తన ఫ్యామిలీ కష్టాల్లో ఉండేదని, అందుకే బిగ్‌బాస్‌పై తనకు గౌరవం ఉందని తెలిపాడు.
రోహిత్ మరీనా కాల్...
ఆ తర్వాత రోహిత్‌ను గార్డెన్ ఏరియాలోకి బిగ్‌బాస్ పిలిచాడు. అతడి జర్నీని చూపించాడు. వైఫ్ మరీనా నుంచి కాల్ రాగానే రోహిత్ ఆనందంగా ఫీలయ్యాడు. నిన్ను చాలా మిస్ అవుతున్నానంటూ మరీనా చెప్పింది. తాను చాలా బాగున్నానని, బయటనుంచి నీ గేమ్ చూస్తుంటే గర్వంగా ఉందని మరీనా తెలిపింది. . తన వాయిస్ విని బాధపడవద్దని , కప్ గెలవాలని రోహిత్‌తో మరీనా చెప్పింది.
బిగ్‌బాస్ చెప్పిన మొసలి కథ...
మొసలి నీటిలో తన బలాన్ని స్వేచ్ఛగా ప్రదర్శిస్తుందని, అదే నేలపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ఆలోచిస్తుందని రోహిత్‌ను ఉద్దేశించి బిగ్‌బాస్ పేర్కొన్నాడు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదైనా చేయడానికి ధైర్యం కావాలని అన్నాడు. అలాంటి ధైర్యం రోహిత్‌తో పాటు మరీనాలో కనిపించినట్లు తెలిపాడు.
భార్యాభర్తలుగా కలిసి ఆడినప్పుడు మిమ్మల్ని కంటెస్టెంట్స్ చాలా సార్లు నామినేట్ చేశారని, స్నేహితులు కలిసి ఆడితే తప్పు కానప్పుడు మీరిద్దరు కలిసి ఆడితే ఎందుకు తప్పు అవుతుందో అర్థం కాలేదని బిగ్‌బాస్ అన్నాడు. హౌజ్‌లో రోహిత్ తన సహనాన్ని ఏ రోజు కోల్పోలేదని బిగ్‌బాస్ ప్రశంసించాడు. రోహిత్ మంచితనాన్ని ఇతరులు అవకాశంగా తీసుకున్నా వారికి అతడు ఎప్పుడూ చెడు చేయలేదని మెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ మాటలతో రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.