Geetu Royal Political Entry: రాజకీయాల్లోకి గీతూ ఆసక్తి.. రూలర్ అవుతానని స్పష్టం
Geetu Royal Political Entry: బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్.. రాజకీయాలపై ఆసక్తి చూపిస్తుంది. తను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇంత వరకు ఏ పార్టీలో చేరాలనేది తాను ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపింది.
Geetu Royal Political Entry: గలాటా గీతూ.. బిగ్‌బాస్ సీజన్ 6లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి హౌస్ మేట్స్‌ను ఓ ఆట ఆడుకుంది. రివ్యూవర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గీతూ.. అనంతరం అదే బిగ్‌బాస్ హౌస్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. తను ఉన్నంత కాలం ఏదోక రూపంలో ప్రేక్షకులకు చేరువైంది. చిత్తూరు యాసలో మాట్లాడుతూ తనదైన శైలితో అలరించింది. అయితే ప్రేక్షకులు మాత్రం ఆమె ఉత్సాహాన్ని, అతి తెలివిని తట్టుకోలేక 9 వారాలకే ఆమెను ఇంటికి పంపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ బాధ నుంచి బయటకు రాలేక పలుమార్లు కంటతడి పెట్టుకుంది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లే మాట్లాడే గీతూ.. తాజాగా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
ట్రెండింగ్ వార్తలు
రాజకీయాల్లోకి రావాలనే తన మనస్సులోని మాటలను బయట పెట్టింది గీతూ. ఇటీవల చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజాసేవ చేయడం కోసం పాలిటిక్స్‌లో అరంగేట్రం చేయాలని అనుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయించుకుంటానని, ప్రస్తుతాని ఫలానా పార్టీలో చేరాలని అనుకోలేదని తెలిపింది. బిగ్‌బాస్ హౌస్ ఇటీవలే బయటకొచ్చిన తనకు రాజకీయాల్లో అరంగేట్రానికి ఇంకొన్ని రోజులు సమయపడుతుందని స్పష్టం చేశారు.
"ప్రజా సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నాది ఇంకా చిన్నవయస్సే. పదవులపై ఆశతో కాదు.. సేవ చేయాలని రావాలనుకుంటున్నాను." అని గీతూ రాయల్ స్పష్టం చేసింది.
బిగ్‌బాస్ హౌస్ గీతూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొదటి నుంచి తాను టాప్-5 కంటెస్టెంట్‌నని బలంగా నమ్మిన ఈమె.. బిగ్‌బాస్ షాకిచ్చారు. తన అతి తెలివితేటలతో హౌస్ మేట్స్‌తో పాటు ప్రేక్షకులకు చికాకు తెప్పించి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆట కోసం ఎంత వరకైనా వెళ్లే ఈమె ప్రవర్తనపై ఆడియెన్స్‌కు విసుగు వచ్చింది. దీంతో 9 వారంలో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఎలిమినేట్ అయ్యేటప్పుడు వేదికపైనే కన్నీరుమున్నీరుగా విలపించింది. అంతేకాకుండా బయటకు వచ్చిన తర్వాత బిగ్‌బాస్‌ను టీవీలో చూస్తూ పదే పదే కంటతడి పెట్టుకుంది. హౌస్‌లో ఆదిరెడ్డిని ఎక్కువగా నమ్మిన ఈ అమ్మడు.. అతడితో ఆ ఫ్రెండ్షిప్‌ను అలాగే కొనసాగిస్తోంది.
సంబంధిత కథనం