Bhoothaddam Bhaskar Narayana: తూర్పు దిక్కుకే డెడ్ బాడీలు.. సైకో సీరియల్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ-bhoothaddam bhaskar narayana trailer released bhoothaddam bhaskar narayana ott deal closed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bhoothaddam Bhaskar Narayana Trailer Released Bhoothaddam Bhaskar Narayana Ott Deal Closed

Bhoothaddam Bhaskar Narayana: తూర్పు దిక్కుకే డెడ్ బాడీలు.. సైకో సీరియల్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ

Sanjiv Kumar HT Telugu
Feb 29, 2024 10:39 AM IST

Bhoothaddam Bhaskar Narayana Trailer Launch: తెలుగులో సరికొత్త క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా వస్తోంది భూతద్ధం భాస్కర్ నారాయణ. ఇప్పటికే టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా ఇటీవల భూతద్ధం భాస్కర్ నారాయణ ట్రైలర్ విడుదలై అంతకుమించి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

తూర్పు దిక్కుకే డెడ్ బాడీలు.. సైకో సీరియల్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ
తూర్పు దిక్కుకే డెడ్ బాడీలు.. సైకో సీరియల్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ

Bhoothaddam Bhaskar Narayana Trailer: శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అలరించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత క్యురియాసిటీ పెంచింది.

భయాన్ని కలిగించే ఓ లాఫింగ్ ఎఫెక్ట్ తో మొదలైన భూతద్ధం భాస్కర్ నారాయణ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. ఎవ్వరీ టక్కరి బుడతడు.. విల్లంబులు (గన్స్) పట్టినాడు.. ఎల్లిదముగా ఆడదానితో అడువుల్లో తచ్చాడుతున్నాడు అంటూ నాటకం ద్వారా హీరో ఎంట్రీని చాలా కామెడీగా, డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారు. హీరో శివ క్యారెక్టర్‌ని బిగినింగ్‌లో ఓ ఫన్ నోట్‌లో ప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ కేసు తెరపైకి వచ్చిందో కథ ఉత్కంఠగా మారుతుంది.

చెక్కతో చేసి దిష్టి బొమ్మలు, చనిపోయిన వారి డెడ్ బాడీలు తూర్పు దిక్కుకు ఉండటం, సైకో సీరియల్ కిల్లర్ కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చాలా ఎంగేజింగా ఉన్నాయి. 'భూతద్ధం భాస్కర్ నారాయణ'గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్‌గా ఉంది. హీరోయిన్ రాశి సింగ్ కేసుని ఫాలో చేసే జర్నలిస్ట్‌గా కనిపించింది. నటులు షఫీ, దేవిప్రసాద్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్‌లో ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా మార్చి 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో "ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని హీరో శివ కందుకూరి తెలిపాడు.

"సినిమా ప్రమోషన్స్‌ని చాలా యూనిక్ చేశాం. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. మా సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మాకు పరిశ్రమ నుంచి కూడా మంచి ఆదరణ దొరికింది. చాలా మంది సపోర్ట్ చేశారు. ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడంతో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. గీతా డిస్ట్రిబ్యూషన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు" అని శివ పేర్కొన్నాడు.

"పదేళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. ఈ సినిమాతో దర్శకుడిగా నా కల నేరవేరుతుంది. మా సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్‌కి ధన్యవాదాలు. శ్రీచరణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా సపోర్ట్ చేశారు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. శివ అద్భుతమైన నటుడు. తన వాయిస్ కూడా చాలా ఆకర్శణీయంగా ఉంటుంది. తనలో చాలా గొప్ప ప్రతిభ ఉంది. అలాంటి హీరో దొరికినందుకు ఆనందంగా ఉంది. షఫీ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రాశీ చాలా కష్టపడింది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి" అని డైరెక్టర్ కోరారు.

WhatsApp channel