OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న దిష్టి బొమ్మ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
Bhoothaddam Bhaskar Narayana OTT Response: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ అండ్ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భూతద్ధం భాస్కర్ నారాయణ. దిష్టి బొమ్మ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో అంతగా ప్రేక్షకాదర దక్కలేదు. కానీ, ఓటీటీలో మాత్రం టాప్‌లో దూసుకుపోతోంది.
Bhoothaddam Bhaskar Narayana OTT Trending: ఓటీటీలోకి ప్రతి వారం కొత్త సినిమాలు ఎంట్రీ ఇస్తుంటాయన్న సంగతి తెలిసిందే. వాటిలో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు థియేటర్లలో పెద్దగా ప్రేక్షకాదరణ పొందని సినిమాలు కూడా ఉంటాయి. కానీ, కొన్ని మూవీస్ థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయిన ఓటీటీల్లో మాత్రం అదరగొడుతుంటాయి. ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకుంటాయి. అలాంటి కోవకు చెందినదే భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ.
ప్రమోషనల్ కంటెంట్
ఓటీటీలోకి లేటెస్ట్‌గా వచ్చిన క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. దిష్టి బొమ్మ నేపథ్యంతో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. అయితే భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ఏఐతో క్రియేట్ చేసిన శివ ట్రాప్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాను థియేటర్లలో వారం రోజుల వరకు బాగానే ఆదరించారు ప్రేక్షకులు.
మైథలాజికల్ నేపథ్యంలో
కానీ, వారం రోజుల తర్వాత మిగతా సినిమాల తాకిడి కారణంగానో, పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోవడం వల్లో భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాను థియేటర్ల నుంచి తొలగించాల్సి వచ్చింది. కానీ, సినిమాకు, నటీనటులకు మాత్రం ప్రశంసలు రావడంతోపాటు కలెక్షన్స్ కూడా పర్వాలేదనేలా ఉన్నాయని సమాచారం. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు మైథలాజికల్, పౌరాణిక నేపథ్యం యాడ్ చేసి కాస్తా లవ్, కామెడీని రంగరించి భూతద్ధం భాస్కర్ నారాయణ తెరకెక్కించారు.
టాప్ 3 ట్రెండింగ్‌లో
భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా మార్చి 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదల కావడంతోనే సినిమాను ఎంతో మంది వీక్షించారు. దాంతో భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ ఆహ ట్రెండింగ్ సినిమాల్లో మూడో స్థానం సంపాదించుకుంది. టాప్ 3 ట్రెండింగ్ ప్లేసులో ఈ సినిమా దూసుకుపోతోంది. ఇలా థియేటర్లలో ఆదరించని ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం ఇలా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఈ మూవీలో దిష్టిబొమ్మ నేపథ్యంలో కథ సాగుతుంది. దిష్టి బొమ్మను పెట్టి చేసే హత్యల చుట్టూ మూవీ తిరుగుతుంటూ ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు కాస్తా లవ్, రొమాన్స్‌తోపాటు కామెడీని యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ పురుషోత్తం రాజ్.
మార్చి 22 నుంచి స్ట్రీమింగ్
భూతద్ధం భాస్కర్ నారాయణ ఓటీటీ హక్కులను ఆహా మంచి ధరకు దక్కించుకుంది. ఈ సినిమాను మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపింది ఆహా ఓటీటీ సంస్థ.
"బొమ్మ కనిపించే ప్రతిసారీ దిమ్మ తిరిగే ట్విస్ట్ ఉంటది. అదేంటో తెలుసుకోవాలని ఉందా?" అని క్యాప్షన్ రాసుకొచ్చిన ఆహా టీమ్ భూతద్ధం భాస్కర్ నారాయణ డిజిటల్ ప్రీమియర్ మార్చి 22 నుంచి చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా టీమ్. "ఇది మీ ఇంటి బయట ఉన్న దిష్టి బొమ్మ కథ.. తెలుసుకోరా మరి? వస్తుంది మీ ఇంటికే మార్చి 22న!" అని పోస్టర్‌లో రాసి ఉంది.