Bhoothaddam Bhaskar Narayana OTT: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-bhoothaddam bhaskar narayana ott release on aha officially announced bhoothaddam bhaskar narayana ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhoothaddam Bhaskar Narayana Ott: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bhoothaddam Bhaskar Narayana OTT: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 18, 2024 01:04 PM IST

Bhoothaddam Bhaskar Narayana OTT Official: ఇటీవల తెలుగులో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చింది భూతద్ధం భాస్కర్ నారాయణ. శివ కందుకూరి హీరోగా నటించిన ఈ సినిమా 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మరో నాలుగు రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bhoothaddam Bhaskar Narayana OTT Release: శివ కందుకూరి హీరోగా నటించిన సరికొత్త సినిమా భూతద్ధం భాస్కర్ నారాయణ. మర్డర్ మిస్టరీ జోనర్‌లో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చింది ఈ సినిమా. దీనికి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. ట్రైలర్, టీజర్, సాంగ్స్‌ వంటి ప్రమోషన్స్‌తో బాగా బజ్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. ఇక తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1న థియేటర్లలోకి వచ్చింది భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ.

కామెడీ యాడ్ చేసి

విడుదలైన తొలి రోజ నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది భూతద్దం భాస్కర్ నారాయణ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు మైథలాజికల్ టచ్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ మూవీలో దిష్టిబొమ్మ నేపథ్యంలో కథ సాగుతుంది. దిష్టి బొమ్మను పెట్టి చేసే హత్యల చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు కాస్తా లవ్, రొమాన్స్‌తోపాటు కామెడీని యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ పురుషోత్తం రాజ్.

ఓటీటీపై అధికారికంగా

ప్రస్తుతం భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. భూతద్ధం భాస్కర్ నారాయణ ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది ఆహా. భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీని మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా తన సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపింది ఆహా టీమ్.

దిమ్మ తిరిగే ట్విస్ట్

"బొమ్మ కనిపించే ప్రతిసారీ దిమ్మ తిరిగే ట్విస్ట్ ఉంటది. అదేంటో తెలుసుకోవాలని ఉందా?" అని క్యాప్షన్ రాసుకొచ్చిన ఆహా టీమ్ భూతద్ధం భాస్కర్ నారాయణ డిజిటల్ ప్రీమియర్ మార్చి 22 నుంచి చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా టీమ్. "ఇది మీ ఇంటి బయట ఉన్న దిష్టి బొమ్మ కథ.. తెలుసుకోరా మరి? వస్తుంది మీ ఇంటికే మార్చి 22న!" అని పోస్టర్‌లో రాసి ఉంది. అంటే థియేటర్లలో విడుదలైన సుమారు 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ.

ఇంకో నాలుగు రోజుల్లో

మార్చి 22 అంటే, ఇంకో నాలుగు రోజుల్లో ఆహాలో భూతద్ధం భాస్కర్ నారాయణ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే, ఆహా గత కొన్నేళ్లుగా చాలా తక్కువ బడ్జెట్ చిత్రాల హక్కులను పొందుతోంది. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకు తగిన డబ్బు చెల్లించి ఓటీటీ హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. పౌరాణిక కోణంలో రూపొందిన ఈ చిత్రంలో శివ కందుకూరి చిన్నపాటి డిటెక్టివ్‌గా నటించాడు.

లాభాలు కూడా

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూలతో ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కానీ, పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోవడంతో విడుదలైన వారం రోజులకే థియేటర్ల నుంచి కనుమరుగైపోయింది. ఇండస్ట్రీలో మెల్లగా, నిలకడగా దూసుకుపోతున్న శివ కందుకూరి ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు అందుకున్నాడు.

క్లైమాక్స్ అదుర్స్

భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా చివర్లో సెమీ ఫాంటసీ యాంగిల్‌ని హైలైట్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు డైరెక్టర్. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. స్నేహల్ జంగాల, శశిధర్ కాశీ, కార్తీక్ ముడుంబై ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు.

Whats_app_banner