Bhoothaddam Bhaskar Narayana Movie: ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమా మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ తర్వాత ఆ ఫ్యాంటసీ మిస్టరీ థిల్లర్ చిత్రంపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా నటించారు. డిటెక్టివ్ పాత్రను అతడు పోషించారు. ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. కాగా, భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ ఓటీటీ డీల్ జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది.
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ ‘ఆహా’ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులకు మంచి ధరే వచ్చిదంట. దీంతో ఏకంగా అప్పుడు ఈ చిత్రం లాభాల జోన్‍లోకి వెళ్లిందని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది.
ట్రైలర్‌తో భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ చిత్రంపై ఆసక్తిని పెంచింది. మర్డర్స్ మిస్టరీ, డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్, హారర్ ఫ్యాంటసీ అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
మార్చి 1వ తేదీన భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆహా ఓటీటీలోకి ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఆహా ఓటీటీలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకు మూవీ టీమ్ విభిన్నంగా ప్రమోషన్లను చేస్తోంది. తెల్ల చీర కట్టుకొని దెయ్యం గెటప్‍లో ఓ అమ్మాయి రోడ్లపై తిరుగుతూ ప్రచారం చేసేలా డిజైన్ చేశారు. ఆ అమ్మాయి ‘నన్ను ఎవరు చంపారు’.. ‘నా తల ఎక్కడ' అనే ప్లకార్డులను పట్టుకొని తిరిగారు. సడెన్‍గా ఆమె చూసిన కొందరు జనాలు భయంగా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రమోషన్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. తల లేని మనిషి బొమ్మను కూడా ప్రమోషన్లకు వాడారు.
ఓ సీరియల్ కిల్లర్ వరుసగా హత్యలు చేస్తూ.. తలలు తీసుకెళ్లిన మిస్టరీ చుట్టూ భూతద్దం భాస్కర్ నారాయణ స్టోరీ ఉంటుంది. పోలీసులకు సవాల్‍గా మారిన ఈ కేసును డిటెక్టివ్ భూతద్దం భాస్కర్ నారాయణ (శివ కందుకూరి).. ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. క్షుద్రపూజలు, నరబలి లాంటి అంశాలు కూడా ఈ హత్యలకు కారణంగా ఉంటుందని ట్రైలర్లో అర్థమవుతోంది. ఆ 16 హత్యల మిస్టరీని భూతద్దం భాస్కర్ నారాయణ ఛేదించడం గురించి ఈ మూవీ ఉండనుంది. మార్చి 1న థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో రాశి సింగ్, అరుణ్ కుమార్, దేవీ ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సత్యనారాయణ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి పురుషోత్తమ్ రాజ్ దర్శకత్వం వహించగా.. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రాన్ని స్నేహల్ జంగర్ల, శశిధర్ కాశీ, కార్తీక్ ముడుంబీ సంయుక్తంగా నిర్మించారు. గౌతమ్ జీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేశారు. ట్రైలర్, ప్రమోషన్లతో భారీ ఆసక్తిని రేపిన ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.