ఇదేం ట్విస్ట్ - థియేట్రిక‌ల్‌ రిలీజ్ క్యాన్సిల్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న బాలీవుడ్ మూవీ - కార‌ణం ఏమిటంటే?-bhool chuk maaf theatrical release cancelled this bollywood romantic comedy movie directly streamingon amazon prime ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇదేం ట్విస్ట్ - థియేట్రిక‌ల్‌ రిలీజ్ క్యాన్సిల్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న బాలీవుడ్ మూవీ - కార‌ణం ఏమిటంటే?

ఇదేం ట్విస్ట్ - థియేట్రిక‌ల్‌ రిలీజ్ క్యాన్సిల్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న బాలీవుడ్ మూవీ - కార‌ణం ఏమిటంటే?

Nelki Naresh HT Telugu

రాజ్‌కుమార్ రావ్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ భూల్ చుక్ మాఫ్ థియేట్రిక‌ల్ రిలీజ్ క్యాన్సిల్ అయ్యింది. మే 9న థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల్సిన ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

భూల్ చుక్ మాఫ్

రాజ్‌కుమార్ రావ్‌, వామికా గ‌బ్బి హీరోహీరోయిన్లుగా న‌టించిన భూల్ చుక్ మాఫ్ మూవీ మే 9న థియేట‌ర్ల‌లో రిలీజ్ కావాల్సింది. రిలీజ్‌కు మ‌రో రోజు ఉండ‌గా మేక‌ర్స్ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. భూల్ చుక్ మాఫ్ మూవీ థియేట్రిక‌ల్ రిలీజ్‌ను క్యాన్సిల్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డైరెక్ట్‌గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

అమెజాన్ ప్రైమ్‌లో...

మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో భూల్ చుక్ మాఫ్‌ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సినిమాను థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌ని అనుకున్నామ‌ని, కానీ దేశంలో నెల‌కొన్న తాజా ప‌రిణామాలు, సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నేప‌థ్యంలో త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకొని ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.

ధ‌న‌శ్రీ వ‌ర్మ స్పెష‌ల్ సాంగ్‌…

రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న భూల్ చుక్ మాఫ్ మూవీకి క‌ర‌ణ్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ మాజీ భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. టింగ్ లింగ్ సంగ అనే ఈ పాట‌ను బుధ‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

రంజ‌న్ ల‌వ్ స్టోర్‌...

భూల్ చుక్ మాఫ్ మూవీ వార‌ణాసి బ్యాక్‌డ్రాప్‌లో సాగ‌నుంది. రంజ‌న్, టిట్లి మిశ్రా ప్రేమించుకుంటారు. ప్ర‌భుత్వ ఉద్యోగం సాధిస్తేనే త‌న కూతురిని ఇచ్చి పెళ్లిచేస్తాన‌ని టిట్లి మిశ్రా తండ్రి కండీష‌న్ పెడ‌తాడు. అత‌డు కోరిన‌ట్లే ప్ర‌భుత్వ ఉద్యోగం సాధిస్తాడు రంజ‌న్‌. హ‌ల్ధీ వేడుక రోజు త‌న జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ నిజం రంజ‌న్‌కు తెలుస్తుంది? అదేమిటి దాని వ‌ల్ల అత‌డు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? 30వ తేదీకి రంజ‌న్ పెళ్లికి ఉన్న సంబంధం ఏమిటి అనే అంశాల‌తో ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ శ‌ర్మ ఈ మూవీని రూపొందించారు.

శ్ర‌ద్ధాక‌పూర్ అనుకొని...

భూల్ చుక్ మాఫ్ మూవీని దినేష్ విజ‌న్ ప్రొడ్యూస్ చేశారు. త‌నీష్ భాగ్చి, కేథ‌న్ సోధా మ్యూజిక్ అందించారు. తొలుత ఈ మూవీలో కార్తీక్ ఆర్య‌న్‌, శ్ర‌ద్ధా క‌పూర్ హీరోహీరోయిన్లుగా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

స్త్రీ 2 మూవీ క‌లెక్ష‌న్స్‌...

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ప‌రిమితం కాకుండా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్నాడు రాజ్‌కుమార్ రావ్‌. అత‌డు హీరోగా గ‌త ఏడాది రిలీజైన‌ హార‌ర్ కామెడీ మూవీ స్త్రీ 2 బాలీవుడ్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. 870 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శ్రీకాంత్ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న‌ది. గ‌త ఏడాది హీరోగా నాలుగు సినిమాలు చేశాడు రాజ్‌కుమార్ రావ్‌.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం