Telugu Serials: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని కొత్త సీరియల్స్ సిద్ధమవుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన ఈ కొత్త సీరియల్స్ త్వరలోనే టీవీల్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని సీరియల్స్ లాంఛింగ్ డేట్ ఆయా ఛానెల్స్ కన్ఫామ్ చేశారు. స్టార్ మా, జీ తెలుగుతో పాటు ఇతర ఛానెల్స్‌లో టెలికాస్ట్ కాబోతున్న ఆ కొత్త సీరియల్స్ ఏవంటే?
ఇటీవలే స్టార్ మాలో గీత ఎల్ఎల్‌బీ, నువ్వుంటే నా జతగా సీరియల్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా మరో కొత్త సీరియల్‌తో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నది స్టార్ మా. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సీరియల్‌కు భానుమతి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిన్న మరుమగల్ కు రీమేక్‌గా భానుమతి సీరియల్ తెరకెక్కుతోంది.
భానుమతి సీరియల్‌లో శంకర్‌కుమార్ చక్రవర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు.భానుమతి సీరియల్ ప్రోమోను ఇటీవల స్టార్ మా రిలీజ్ చేసింది. కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ బాగా చదువుకోవాలని కలలు కనే ఓ యువతికి పెళ్లి ఎలా అడ్డంకిగా మారింది? పెళ్లి తర్వాత తన చదువును కొనసాగించిందా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఈ సీరియల్ తెరకెక్కుతోన్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. మార్చి నెలలో ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
ఛత్రపతి ఫేమ్ శేఖర్ ప్రధాన పాత్రలో లక్ష్మినివాసం పేరుతో ఓ సీరియల్ తెరకెక్కుతోంది. మార్చి 3 నుంచి జీ తెలుగులో ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది ఈ సీరియల్ లాంఛ్ డేట్‌ను జీ తెలుగు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న లక్ష్మినివాసం సీరియల్‌లో ఛత్రపతి శేఖర్‌తో పాటు శ్రీరంజని కీలక పాత్రలో నటిస్తోంది. లక్ష్మినివాసం సీరియల్‌కు జయంత్ రాఘవన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ప్రతి రోజు రాత్రి ఏడు గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతుందని జీ తెలుగు ప్రకటించింది.
ఈటీవీ కొత్తగా ఓ మైథలాజికల్ సీరియల్‌ను మొదలుపెట్టబోతున్నది. ఆదిపరాశక్తి పేరుతో ఈ సీరియల్ తెరకెక్కుతోంది. ఇదొక డబ్బింగ్ సీరియల్ ఈటీవీ లైఫ్‌లో టెలికాస్ట్ కాబోతుంది. ఈ సీరియల్‌లో రతి పాండే, తరణ్ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించారు. తార పేరుతో మరో డబ్బింగ్ సీరియల్ ఈటీవీలో లాంఛ్ కానుంది.
ఈటీవీలో స్ట్రెయిట్ కథాంశంతో వేయి శుభములు కలుగు నీకు సీరియల్ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సీరియల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సీరియల్‌లో శిల్పా చక్రవర్తి, మౌనిక, వీజే సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. \జెమిని టీవీలో యశోద పేరుతో ఓ సీరియల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
సంబంధిత కథనం