Tv Serial: తొలి వారమే టీఆర్‌పీలో భానుమతి సీరియల్‌కు షాక్ - తమిళంలో టాప్ - తెలుగులో లాస్ట్
Tv Serial:భానుమతి సీరియల్‌కు లాంఛింగ్ వీక్ షాక్ తగిలింది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో 2.99తో డిసపాయింట్ చేసింది. భానుమతికి మాతృక అయిన తమిళ సీరియల్ చిన్న మరుమగల్ మాత్రం లేటెస్ట్ టీఆర్‌పీలో టాప్‌లో నిలిచింది.
Tv Serial: భానుమతి సీరియల్‌కు తొలి వారమే పెద్ద షాక్ తగిలింది. ఫస్ట్ వీక్‌లో కేవలం 2.99 టీఆర్‌పీ రేటింగ్‌ను మాత్రమే దక్కించుకొని డిసపాయింట్ చేసింది. అర్బన్ ఏరియాలో 3.10 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో తమిళంలో టాప్‌లో నిలిచిన ఈ సీరియల్ తెలుగులో మాత్రం లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
చిన్న మరుమగల్ సీరియల్...
తమిళ సీరియల్ చిన్న మరుమగల్‌కు రీమేక్‌గా భానుమతి రూపొందింది. చిన్న మరుమగల్ సీరియల్ లేటెస్ట్ రేటింగ్స్‌లో 7.81టీఆర్‌పీతో స్టార్ విజయ్ ఛానెల్‌లోనంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ప్రైమ్ టైమ్‌లో స్లాట్ లీడర్‌గా అద్భుత ఆదరణతో దూసుకుపోతుంది.
భానుమతిపైనే...
తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన సీరియల్ కావడంతో తెలుగులోనూ భానుమతిపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తొలి వారం అంతంత మాత్రంగానే ఆదరణను దక్కించుకున్నది. లేటెస్ట్‌గా స్టార్ మాలో ప్రారంభమైన సీరియల్స్‌లో అతి తక్కువ టీఆర్‌పీని సొంతం చేసుకున్న సీరియల్‌గా భానుమతి నిలిచింది.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ...
భానుమతి సీరియల్‌లో శంకర్‌కుమార్ చక్రవర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.ఈ సీరియల్‌తోనే వీరిద్దరు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సాయికుమార్, స్రవంతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రియల్ లైఫ్‌లో భార్యాభర్తలైన వీరిద్దరు సీరియల్‌లోనే అవే పాత్రల్లో కనిపిస్తున్నారు.
భానుమతి లక్ష్యానికి పార్ధు అండ...
భానుమతి బాగా చదువుకొని డాక్టర్ కావాలని కలలు కంటుంది. తాగుబోతు తండ్రి కారణంగా అడుగడుగునా ఆమెకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. తండ్రి బలరామ్‌ను ఎవరైనా మోసం చేస్తే అస్సలు సహించడు పార్థు. వారి తాట తీసే వరకు నిద్రపోడు. భిన్న మనస్తత్వాలు కలిగిన భానుమతి, పార్ధు ఎలా పెళ్లిపీటలెక్కారు? భానుమతి లక్ష్యానికి పార్ధు ఎలా అండగా నిలిచాడు? బలరామ్‌ను భానుమతి జైలుకు పంపించడానికి కారణం ఏమిటి అనే కథతో ఈ సీరియల్ తెరకెక్కింది.
అన్నపూర్ణ స్టూడియోస్ ...
హీరో నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ భానుమతి సీరియల్‌ను నిర్మించింది. భానుమతితో పాటు ఇటీవలే స్టార్ మాలో నువ్వుంటే నా జతగా, గీత ఎల్ఎల్‌బీ, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ కొత్తగా లాంఛ్ అయ్యాయి.
సంబంధిత కథనం