Bhama Kalapam 2 for Aha Subscribers: ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు బంపర్ ఆఫర్.. రిలీజ్‌కు 100 రోజుల ముందే ఈ సినిమా చూడండి
Bhama Kalapam 2 for Aha Subscribers: ఆహా ఓటీటీ గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు బంపర్ ఆఫర్. రిలీజ్‌కు 100 రోజుల ముందే ప్రియమణి నటించిన భామా కలాపం 2 మూవీ చూసే అవకాశం రావడం విశేషం.
Bhama Kalapam 2 for Aha Subscribers: ప్రియమణి నటించిన భామా కలాపం 2 మూవీని 100 రోజుల ముందే చూసే అవకాశం తమ గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు కల్పిస్తోంది ఆహా ఓటీటీ. దీనికోసం వాళ్లు చేయాల్సిందల్లా ఓ ఫామ్ నింపడమే. ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా ఆహా వెల్లడించింది. ఆ ఫామ్ లింక్ కూడా ఇచ్చింది.
భామా కలాపం 2 మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఆ సినిమా అధికారికంగా రిలీజ్ కాకముందే డిసెంబర్ 10వ తేదీన ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్ల కోసం స్పెషల్ షో వేయనున్నారు. దీనికోసం ఓ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ahavideoin అనే ఎక్స్ అకౌంట్లోకి వెళ్తే అక్కడ ఓ లింకు ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ ఫామ్ ఓపెన్ అవుతుంది.
అందులో మీ ఈమెయిల్, మీ పేరు, ఫోన్ నంబర్ తోపాటు ఎన్ని టికెట్లు కావాలో వెల్లడించాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ చేసుకున్న సబ్‌స్క్రైబర్ల కోసం డిసెంబర్ 10న అమీర్‌పేట్ లోని ఎఎఎ సినిమాస్ లో స్పెషల్ షో వేస్తారు. ఆహా గోల్డ్ హైదరాబాద్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు.
భామా కలాపం 2 మూవీ గురించి..
ప్రియమణి గతంలో నటించిన భామా కలాపం మూవీ నేరుగా ఆహా ఓటీటీలోకి వచ్చింది. అయితే సీక్వెల్ మాత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ పోస్టర్ ను గత నెలలోనే మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో వాక్యూమ్ క్లీనర్‌ను పట్టుకొని స్టైలిష్ లుక్‌లో ప్రియమణి కనిపిస్తోంది. ఆమె పక్కన రక్తం మరకలతో కూడిన ట్రాలీ బ్యాగ్ ఉండటం ఆసక్తిని పంచుతోంది.
భామాకలాపం 2 మూవీకి అభిమన్యు దర్శకత్వం వహిస్తోన్నాడు. పక్కవాళ్ల విషయాల పట్ల ఆసక్తిని చూపే అనుపమ అనే మధ్య తరగతి గృహిణి ఓ మర్డర్ కేసులో ఎలా చిక్కుకుంది. ఆ నేరం నుంచి బయటపడేందుకు ఆమె చేసే ప్రయత్నాల నేపథ్యంలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా భామాకలాపం మూవీ తెరకెక్కింది.