ఓటీటీలోకి ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్- 7.1 నుంచి 5కి పడిపోయిన రేటింగ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-bhairavam ott streaming on zee5 officially manchu manoj bellamkonda sai sreenivas nara rohith bhairavam ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్- 7.1 నుంచి 5కి పడిపోయిన రేటింగ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్- 7.1 నుంచి 5కి పడిపోయిన రేటింగ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ముగ్గురు హీరోల తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం వచ్చేయనుంది. తాజాగా భైరవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు నటించిన మల్టీస్టారర్ మూవీ భైరవం ఓటీటీ రిలీజ్‌పై ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్- 7.1 నుంచి 5కి పడిపోయిన రేటింగ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌లోని ముగ్గురు హీరోలు కలిసిన నటించిన సినిమా భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన మల్టీ స్టారర్ సినిమా భైరవం తమిళ సూపర్ హిట్ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన విషయం తెలిసిందే.

ముగ్గురు హీరోలతో

విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి ప్రతిభ కనబర్చిన విజయ్ కనకమేడల భైరవం సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ భైరవం సినిమాను భారీగా నిర్మించారు. భైరవం సినిమాలో ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రలు పోషించారు.

వీరితోపాటు భైరవం సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్వా పిళ్లై హీరోయిన్స్‌గా చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన భైరవం సినిమా వరల్డ్ వైడ్‌గా మే 30న థియేటర్లలో విడుదలైంది. అయితే, భైరవం సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ రొటీన్‌గా ఉన్న టేకింగ్‌లో కాస్తా కొత్తదనం కనిపించిందన్నారు.

యాక్టింగ్‌పై ప్రశంసలు

అలాగే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్టింగ్ బాగుందని, మంచు మనోజ్‌ను కొత్తగా చూస్తారని, నారా రోహిత్ ఎప్పుడ లేనంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ప్రశంసలు వచ్చాయి. అయితే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత భైరవం సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 7.1 రేటింగ్ ఉండేది. కానీ, ఇప్పుడు అది 5కి పడిపోయింది.

5కి పడిపోయిన రేటింగ్

అంటే, ప్రస్తుతం భైరవం సినిమాకు ఐఎమ్‌డీబీలో 10కి 5 రేటింగ్ ఉంది. ఇక తాజాగా భైరవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. జీ5లో భైరవం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. భైరవం ఓటీటీ రిలీజ్‌పై కమింగ్ సూన్ అంటూ జీ5 సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.

ఇదే నెల జూలైలో భైరవం ఓటీటీ రిలీజ్ కానుంది. జూలై రెండో వారంలో భైరవం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే, ఇవాళ, లేదా రేపు భైరవం ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా జీ5 ప్లాట్‌ఫామ్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

భైరవం కథ

ఇక భైరవం కథలోకి వెళితే.. శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), గజపతి వర్మ (మంచు మనోజ్), వరద (నారా రోహిత్) ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఊరిలో వారాహి అమ్మవారి గుడికి చెందిన భూములను మంత్రి (శరత్ లోహితాస్య) కాజేయాలని ప్రయత్నిస్తాడు.

కానీ, దానికి అడ్డంగా ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. ఆ గుడికి ధర్మకర్తగా ఉన్న గజపతి నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) అకస్మాత్తుగా మరణిస్తుంది. దీంతో గజపతి దగ్గర పనిచేసే శీను గుడికి ధర్మకర్త అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే భైరవం కథ.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం