Bhairathi Ranagal Review: తెలుగులో రిలీజైన కన్నడ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
Bhairathi Ranagal Review: కన్నడ యాక్షన్ మూవీ భైరతి రణగల్ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

Bhairathi Ranagal Review: కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటించిన భైరతి రణగల్ మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ మఫ్టీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు నార్తన్ దర్శకత్వం వహించాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. భైరతి రణగల్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
గ్యాంగ్‌స్టర్ భైరతి రణగల్…
భైరతి రణగల్‌ది (శివరాజ్‌కుమార్) రోణాపురం. ఊళ్లోని నీటి సమస్యను తీర్చే క్రమంలో ప్రభుత్వ ఆఫీస్‌లో బాంబు పెడతాడు. ఈ నేరానికిగాను 21 ఏళ్లు జైలు శిక్షను అనుభవిస్తాడు. జైలులో చదువుకొని లాయర్ పట్టా అందుకుంటాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత రోణాపురంలో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూ పేదలకు అండగా నిలుస్తాడు. రోణాపురంలోని స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే రెండు వేల మంది కార్మికులను ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు కంపెనీ అధిపది పరాండే (రాహుల్ బోస్).
కార్మికుల భూములను పరాండే అక్రమంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడనే నిజం భైరతి రణగల్ ఇన్వేస్టిగేషన్‌లో తేలుతుంది. డబ్బు, అధికారం బలంతో భైరతి రణగల్‌పై కేసు గెలుస్తాడు పరాండే. కార్మికులకు న్యాయం చేసేందుకు భైరతి రణగల్ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు.
క్రైమ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయిన భైరతి రణగల్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? పరాండే అన్యాయాలను ఎలా ఎదురించాడు? చెల్లి భర్తనే భైరతి రణగల్ ఎందుకు చంపాల్సివచ్చింది? రణగల్‌ను ప్రేమించిన వైశాలి (రుక్మిణి వసంత్) అతడికి ఎందుకు దూరమైంది? అన్నదే ఈ మూవీ కథ.
హీరోయిజం..ఎలివేషన్లు...
ఇదివరకు సినిమాల్లో యాక్షన్, హీరోయిజం, ఎలివేషన్లు కథలో అంతర్భాగంగా ఉండేవి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. లార్జన్‌దేన్‌లైఫ్‌లో హీరో క్యారెక్టర్‌ను రాసుకుంటున్నారు. హీరోయిజం, ఎలివేషన్ల మధ్య కథలను ఇరికిస్తున్నారు.
ప్రీక్వెల్...
భైరతి రణగల్ సినిమా అలాంటిదే. కన్నడంలో 2017లో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మఫ్టీ మూవీకి ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మఫ్టీ మూవీలో శివరాజ్‌కుమార్ చేసిన భైరతి రణగల్ పాత్రను ప్రధానంగా చేసుకొని దర్శకుడు నార్తన్ ఈ మూవీని రూపొందించాడు.
లిమిట్ దాటేశాడు...
సామాన్యులకు న్యాయం చేసేందుకు కత్తి పట్టిన ఓ లాయర్ కథ ఇది. ఈ సింపుల్ స్టోరీని యాక్షన్ అంశాలతో నింపేశారు డైరెక్టర్. విలన్‌ను దెబ్బకొట్టేందుకు హీరో వేసే ఎత్తులు కొన్ని భలేగా ఉన్నాయని అనుకునేలా ఉంటాయి. మరికొన్ని మాత్రం లిమిట్‌దాటిన ఫీలింగ్ కలుగుతుంది.
కార్మికులకు న్యాయం చేసేందుకు హీరో ఏకంగా స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం, అది ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫేమస్ అయిపోవడం, ఓ ఊరి గ్యాంగ్‌స్టర్ అయిన హీరో ఏకంగా సీఏంనే మార్చేయడం..తనను అరెస్ట్ చేసిన పోలీస్‌ను భయపెట్టడానికి ఏకంగా పోలీస్ స్టేషన్ కాల్చేయడం లాంటి సీన్స్ లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి.
లవ్‌స్టోరీ...
గ్యాంగ్‌స్టర్‌గా భైరతి రణగల్ మారిన తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్ బాగుంది. ఆరంభ సన్నివేశాలతో పాటు గవర్నమెంట్ ఆఫీసర్‌కు హీరో వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్‌ను బాగా రాసుకున్నాడు. లవ్‌స్టోరీని కథలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు హీరోయిన్ ఈ సినిమాకు అవసరం లేదు.
క్యారెక్టర్ గ్రాఫ్...
భైరతి రణగల్ పాత్రలో శివరాజ్‌కుమార్ గెటప్ బాగుంది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. విలన్‌గా రాహుల్ బోస్ పాత్రను డైరెక్టర్ పేలవంగా రాసుకున్నాడు. పవర్‌ఫుల్ విలన్‌గా రాహుల్‌బోస్ గురించి ఆరంభంలో ఇంట్రడక్షన్ ఇచ్చాడు డైరెక్టర్. పోనుపోను అతడి క్యారెక్టర్ గ్రాప్ తగ్గుతూ రావడం మైనస్‌గా మారింది. రుక్మిణి వసంత్ సినిమాలో గెస్ట్ అప్పీరియెన్స్‌లా ఉంటుంది. రవి బస్రూర్ మ్యూజిక్ బాగుంది.
గ్యాంగ్‌స్టర్ మూవీ..
భైరతి రణగల్ లాజిక్‌లెస్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ. శివరాజ్‌కుమార్ యాక్టింగ్ కోసం ఓ సారి ట్రై చేయచ్చు.
సంబంధిత కథనం
టాపిక్