OTT Kannada Action Thriller: మూడు నెలల తర్వాత మరో ఓటీటీలోకి తెలుగులో వస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ-bhairathi ranagal ott release date kannada action thriller movie to stream in telugu on aha video ott from 13th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Kannada Action Thriller: మూడు నెలల తర్వాత మరో ఓటీటీలోకి తెలుగులో వస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Kannada Action Thriller: మూడు నెలల తర్వాత మరో ఓటీటీలోకి తెలుగులో వస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Published Feb 11, 2025 05:24 PM IST

OTT Kannada Action Thriller: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత ఓ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు రాబోతోంది. రెండు నెలల కిందటే ఓ ఓటీటీలోకి కన్నడలో వచ్చిన మూవీ.. మరో రెండు రోజుల్లో తెలుగులో రానుండటం విశేషం.

మూడు నెలల తర్వాత మరో ఓటీటీలోకి తెలుగులో వస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
మూడు నెలల తర్వాత మరో ఓటీటీలోకి తెలుగులో వస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Kannada Action Thriller: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన మూవీ భైరతి రణగల్. ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి రానుంది. గతేడాది నవంబర్ 15న రిలీజై సంచలన విజయం సాధించిన ఈ మూవీ.. డిసెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం కన్నడలోనే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలుగులోనూ రానుంది.

భైరతి రణగల్ ఓటీటీ రిలీజ్ డేట్

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణగల్ మూవీ ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతోంది. గురువారం (ఫిబ్రవరి 13) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. "ఓ గ్యాంగ్‌స్టర్ ఎప్పుడూ జన్మించడు. అతన్ని తయారు చేస్తారు.. భైరతి రణగల్ ఎలా తయారయ్యాడో చూడండి. ఫిబ్రవరి 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ట్వీట్ చేసింది.

ఇప్పటికే ప్రైమ్ వీడియోలో కన్నడ ఆడియోలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాను ఇక నుంచి తెలుగులోనూ చూసే అవకాశం కలగనుంది. ఈ మధ్య క్యాన్సర్ ను జయించి వచ్చిన శివణ్ణకు తెలుగులోనూ అభిమానులు ఉండటంతో ఈ భైరతి రణగల్ కు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

భైరతి రణగల్ ఎలా ఉందంటే?

శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణగల్ మూవీ గతేడాది నవంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.21 కోట్లు వసూలు చేసింది. 2017లో వచ్చిన మఫ్తీ మూవీకి ఇది ప్రీక్వెల్ కావడం విశేషం. రుక్మిణి వసంత్ ఫిమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమా రూ.18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.

ఓ బాధ్యత గల, చట్టాన్ని గౌరవించే లాయర్ ఓ డాన్ గా ఎలా ఎదిగాడన్నదే మూవీ స్టోరీ. ఇందులో భైరతి పాత్రలో శివ రాజ్ కుమార్ నటించాడు. రోనాపురం ఊరి ప్ర‌జ‌లు ప‌డుతోన్న క‌ష్టాల‌ను ప‌రిష్క‌రించే క్ర‌మంలో భైర‌తి (శివ‌రాజ్‌కుమార్‌) జైలుపాల‌వుతాడు. అక్క‌డే క‌ష్ట‌ప‌డి చ‌దివి లాయ‌ర్ అవుతాడు.

రోనాపురం భూముల్లో కోట్ల విలువైన ఖ‌నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. మైనింగ్ బిజినెస్ పేరుతో ఊరిలోని భూముల‌ను బిజినెస్‌మెన్ ప‌రండే (రాహుల్ బోస్‌) ఆక్ర‌మించుకోవ‌డం మొద‌లుపెడ‌తాడు. ప‌రండే అక్ర‌మాల‌ను కోర్టు ద్వారా అడ్డుకోవాల‌ని చూస్తాడు. కానీ ప‌రండే అధికారం, డ‌బ్బు ముందు భైర‌తి ఓడిపోతాడు. ఆ త‌ర్వాత ఏమైంది.

రోనాపురాన్ని ప‌రండే బారి నుంచి భైర‌తి ఎలా కాపాడాడు? ఈ పోరాటంలో అత‌డికి అండ‌గా నిలిచిన వైశాలి (రుక్మిణి వ‌సంత్‌) ఎవ‌రు అనే అంశాల‌తో యాక్ష‌న్‌, క్రైమ్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఈ సినిమా కన్నడతోపాటు తెలుగులోనూ రిలీజైనా ఇక్కడి ప్రేక్షకులు అసలు ఈ మూవీని పట్టించుకోలేదు. ఇక ప్ర‌స్తుతం శివ‌రాజ్‌కుమార్ తెలుగులో ఓ మూవీ చేస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న ఆర్‌సీ 16 మూవీలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం