Bhagyashri Borse: టాలీవుడ్‌లో మరో బంపరాఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే - దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్
Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ తర్వాత తెలుగులో మరో మూవీకి భాగ్యశ్రీ బోర్సే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్ చేయబోతున్నది. కాంతా పేరుతో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీకి రానా దగ్గుబాటి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు.
Bhagyashri Borse: రవితేజ మిస్టర్ బచ్చన్ తర్వాత తెలుగులో మరో బంపర్ ఆఫర్ అందుకున్నది భాగ్యశ్రీ బోర్సే. దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్ చేయబోతున్నది. దుల్కర్ సల్మాన్ హీరోగా రానా దగ్గుబాటి నిర్మాణంలో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కాంతా అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. డిఫరెంట్ పాయింట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్...
కాంతా మూవీ ఓపెనింగ్ ఈవెంట్ సింపుల్‌గా ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. ఈ ఫొటోల్లో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా కనువిందుచేశారు. వారితో పాటు రానా కూడా ఫొటోల్లో కనిపిస్తున్నాడు. తెలుగులో రూపొందుతోన్న కాంతా సినిమాను తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. కాంతా సినిమాను రానా దగ్గుబాటి సోలోగా ప్రొడ్యూస్ చేస్తోన్నట్లు తెలిసింది. ఈ సినిమాలో రానా గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా డిజాస్టర్ కానీ...
తెలుగులో భాగ్యశ్రీ బోర్సేకు ఇది సెకండ్ మూవీ. రవితేజ మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచినా తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నది భాగ్యశ్రీ బోర్సే. జిక్కీ పాత్రలో అదరగొట్టింది. సినిమాలో రవితేజతో పాటు ఆమె కెమిస్ట్రీ, రొమాంటిక్ డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీలోకి సెప్టెంబర్ 12న రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఆఫర్లు క్యూ...
మిస్టర్ బచ్చన్ ఫ్లాపైనా భాగ్యశ్రీ బోర్సే కుఆఫర్లు క్యూ కడుతోన్నట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ కాంతాతో పాటు విజయ్ దేవరకొండతో మరో మూవీకి భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఈ మూవీపై కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది.
పీరియాడికల్ థ్రిల్లర్...
మరోవైపు తెలుగులో మహానటి, సీతారామం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లను అందుకున్నాడు దుల్కర్ సల్మాన్. లక్కీ భాస్కర్‌తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతోన్నాడు. పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న లక్కీ భాస్కర్ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
కల్కిలో గెస్ట్ రోల్...
ఇటీవలే తెలుగులో ఆకాశంలో ఒకతార అనే సినిమాను అంగీకరించాడు దుల్కర్ సల్మాన్. ఈ మూవీకి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్, వైజయంతీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. ప్రభాస్ కల్కిలో గెస్ట్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు.