Bhagavanth Kesari Teaser: ఈ పేరు షానా ఏండ్లు యాదుంటది.. బాలయ్య భగవంత్ కేసరి టీజర్ అదుర్స్
Bhagavanth Kesari Teaser: ఈ పేరు షానా ఏండ్లు యాదుంటది అంటూ తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగుతో భగవంత్ కేసరి టీజర్ అదుర్స్ అనిపించేలా ఉంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా మేకర్స్ శనివారం (జూన్ 10) టీజర్ రిలీజ్ చేశారు.
Bhagavanth Kesari Teaser: బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా శనివారం (జూన్ 10) భగవంత్ కేసరి టీజర్ రిలీజైంది. ఈ పేరు షానా ఏండ్లు యాదుంటది అంటూ బాలయ్య నోట తెలంగాణ యాసలో డైలాగ్ ఈ టీజర్ కే హైలైట్. బాలకృష్ణను ఇప్పటి వరకూ చూడని ఓ డిఫరెంట్ షేడ్ లో చూపిస్తానని చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తాను చెప్పినట్లే టీజర్ లోనే ఓ భిన్నమైన బాలయ్య బాబుని చూపించాడు.
బాలయ్య అంటే పవర్ ఫుల్ డైలాగులు. అయితే అతని నోట ఓ హిందీ డైలాగ్ వింటే ఎలా ఉంటుంది? తెలంగాణ యాసలో అతడు మాట్లాడితే ఎలా ఉంటుంది? క్రికెట్ బ్యాట్ నే గిటార్ గా వాయిస్తూ ఎంజాయ్ చేస్తున్న బాలయ్య ఎలా ఉంటాడు? భగవంత్ కేసరి టీజర్ చూస్తే అతనిలోని ఈ భిన్నమైన షేడ్స్ అని కనిపిస్తాయి. అనిల్ రావిపూడి, బాలయ్య మార్క్ మూవీగా టీజర్ చూస్తేనే తెలుస్తోంది.
బాలకృష్ణకు ఇది 108వ సినిమా. ఇన్నాళ్లూ ఎన్‌బీకే108గా పిలిచిన ఈ మూవీకి రెండు రోజుల కిందటే భగవంత్ కేసరి అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక శనివారం ఎన్‌బీకే బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. "రాజు ఆని వెనుక ఉన్న వందల మంది మందను చూయిస్తడు.. ముందోడు వానికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు" అనే పవర్ ఫుల్ డైలాగుతో టీజర్ మొదలవుతుంది.
ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ టీజర్ లో డైలాగులు లేకపోయినా తన లుక్స్ తో అదరగొట్టాడు. బాలకృష్ణకు సరిపోయే విలనీని చూపించాడు. "పతా మై ఖానోకే బీచ్ మే బేజా క్యూ రెహతా హై.. జబ్ ఖాన్ బైరీ పడ్తీ హై జబ్ బాత్ బేజే పే గుస్తీ హై" అంటూ బాలయ్య ఓ హిందీ డైలాగు కూడా చెప్పడం విశేషం.
ఇక తమన్ తనదైన స్టైల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో చెలరేగడం ఈ భగవంత్ కేసరి టీజర్ కు హైలైట్. అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి అంటూ తన క్యారెక్టర్ ను బాలయ్య పరిచయం చేస్తాడు. ఇక టీజర్ అంతా బాలకృష్ణను గంభీరంగా చూపించిన అనిల్ రావిపూడి.. చివర్లో మాత్రం బ్యాట్ తో గిటార్ వాయిస్తున్నట్లుగా ఓ ఫన్నీ షేడ్ తో ముగించాడు.