Bhagavanth Kesari OTT Release Date: భగవంత్ కేసరి సినిమా ఓటీటీలోకి ఆ రోజే రానుందా!: వివరాలివే
Bhagavanth Kesari OTT Release Date: భగవంత్ కేసరి సినిమా ఓటీటీ రిలీజ్ గురించి తాజాగా ఓ సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్ డేట్ చక్కర్లు కొడుతోంది.

Bhagavanth Kesari OTT Release Date: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా బ్లాక్‍బాస్టర్ దిశగా దూసుకుపోతోంది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.130కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను భగవంత్ కేసరి దాటేసింది. ఇంకా వసూళ్లను దూకుడుగా రాబడుతోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా, భగవంత్ కేసరి సినిమా ఓటీటీ రిలీజ్ గురించి తాజాగా ఓ సమాచారం బయటికి వచ్చింది.
భగవంత్ కేసరి సినిమా నవంబర్ 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 23వ తేదీన భగవంత్ కేసరి మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం భగవంత్ కేసరి చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబడుతోంది. లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పోటీలో ఉన్నా ఆరంభం నుంచి భగవంత్ కేసరి జోరు చూపిస్తూనే ఉంది. పాజిటివ్ టాక్ రావటం ఈ చిత్రానికి భారీగా కలిసి వచ్చింది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు వస్తున్నాయి. బాలకృష్ణ యాక్టింగ్, యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లను మూవీ యూనిట్ ఇప్పటికీ జోరుగా చేస్తోంది. బ్లాక్‍బాస్టర్ షేర్ కా టూర్ పేరుతో సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల కొన్ని థియేటర్లకు వెళుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు.
భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటించారు. శ్రీలీల ముఖ్యమైన పాత్ర చేశారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అర్జున్ రామ్‍పాల్ విలన్ పాత్రలో మెప్పించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
టాపిక్