బెట్టింగ్ యాప్‍ల ప్రమోషన్ల దుమారం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సాగుతోంది. ఇప్పటికే చాలా మంది యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు జరిగాయి. తాజాగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల సెగ టాలీవుడ్‍కు తగిలింది. స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాట రానాతో పాటు మరికొందరు టాలీవుడ్ సెలెబ్రిటీలపై కేసులు నమోదైనట్టు సమాచారం బయటికి వచ్చింది. బెట్టింగ్ యాప్‍లను ప్రమోట్ చేసినందుకు వీరిపై కేసులు ఫైల్ అయ్యాయి.
బెట్టింగ్ యాప్‍ల ప్రమోషన్ల వ్యవహారంలో సుమారు 25 మంది తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‍ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్‍లోని మియాపూర్ పోలీసులు కేసులు బుక్ చేసిట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్ సహా మరికొందరిపై కేసులు నమోదైనట్టు సమాచారం. కొన్ని బెట్టింగ్ యాప్స్ యాడ్లను చేసినందుకు వీరికి ఈ కేసులు ఫైల్ అయ్యాయి.
హీరోయిన్లు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, ప్రణీత కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. యాంకర్ శ్రీముఖి, సిరి హన్మంతు, వంశీ సౌందర్య రాజన్, అమృత చౌదరి, శోభా శెట్టి, వసంత కృష్ణ, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ సహా మరికొందరిపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన కేసులు ఫైల్ అయ్యాయి. సుమారు 25 మందిపై తాజాగా కేసులను నమోదు చేసినట్టు తెలుస్తోంది.
కేసులు నమోదైన వారిలో కొందరు బెట్టింగ్ యాప్‍ల కోసం యాడ్స్ చేస్తే.. మరికొందరు వారి వారి సోషల్ మీడియా అకౌంట్లలో, యూట్యూబ్‍ల ప్రమోట్ చేశారు. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రకాశ్ రాజ్ సహా టాప్ స్టార్లు కొందరు కొన్ని బెట్టింగ్ యాప్‍ల కోసం యాడ్స్ చేశారు. అవి లీగల్ యాప్స్ అని తెలుస్తోంది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల బెట్టింగ్, ఫ్యాంటసీ యాప్‍లపై నిషేధం ఉంది. దీంతో వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. మరికొందరు సోషల్ మీడియా ఇన్‍ఫ్లుయెన్సర్లు ఇల్లీగల్ యాప్‍లను కూడా ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‍లను ప్రమోట్ చేసిన కొందరు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి.హర్షసాయి, లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీయాదవ్ సహా మరికొందరిపై కేసులు బుక్కయ్యాయి.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ కొంతకాలంగా బెట్టింగ్ యాప్‍లను ప్రమోట్ చేస్తున్న వారిపై ఫోకస్ చేశారు. బెట్టింగ్ యాప్‍ల వల్ల భారీ సంఖ్యలో జనాలు ఆర్థికంగా నష్టపోతుండటంతో అవగాహన కల్పిస్తున్నారు. బెట్టింగ్ యాప్‍లను ప్రమోట్ చేసిన కొందరు యూట్యూబర్ల వీడియోలను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసి చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ట్యాగ్ చేస్తున్నారు. నా అన్వేషణ ఛానెల్ నడిపే యూట్యూబర్ కూడా బెట్టింగ్ యాప్‍లను ప్రమోట్ చేసే వారిని వ్యతిరేకిస్తూ వీడియోలు చేస్తున్నారు. అతడితో సజ్జనార్ కూడా మాట్లాడారు.
సంబంధిత కథనం