Best Web Series for College Students: కాలేజ్ స్టూడెంట్స్.. మీలో మోటివేషన్ నింపే బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే-best web series for college students kota factory half ca aspirants operation mbbs pitchers in netflix prime video zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Best Web Series For College Students Kota Factory Half Ca Aspirants Operation Mbbs Pitchers In Netflix Prime Video Zee5

Best Web Series for College Students: కాలేజ్ స్టూడెంట్స్.. మీలో మోటివేషన్ నింపే బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Mar 13, 2024 12:37 PM IST

Best Web Series for College Students: కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ కు మోటివేషన్ లా పని చేసే వెబ్ సిరీస్ లు కొన్ని ఓటీటీల్లో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, సోనీలివ్ లాంటి ఓటీటీల్లో ఉన్న ఈ సిరీస్ లలో బెస్ట్ ఏవో ఒకసారి చూద్దాం.

కాలేజ్ స్టూడెంట్స్.. మీలో మోటివేషన్ నింపే బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే
కాలేజ్ స్టూడెంట్స్.. మీలో మోటివేషన్ నింపే బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే

Best Web Series for College Students: ఓటీటీలు, వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత అసలు కంటెంట్ కు కొదవే లేదు. ఈ సిరీస్ లు కూడా అన్ని జానర్లలో, అన్ని వర్గాల ఆడియెన్స్ మెచ్చేలా ఉంటున్నాయి. అయితే కాలేజీ స్టూడెంట్స్ కు మోటివేషన్ లా పని చేస్తూ, వాళ్లకు భవిష్యత్తుపై ఓ స్పష్టతనిచ్చేలా కూడా కొన్ని వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.

కాలేజీ స్టూడెంట్స్‌కు బెస్ట్ సిరీస్ ఇవే

స్కూల్ ముగియగానే ఇంటర్ లో ఏ కోర్సు తీసుకోవాలి? ఇంటర్ పూర్తయిన తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇలా స్టూడెంట్స్ మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అదే సమయంలో వాళ్లకు తమ భవిష్యత్తుపై భరోసానిచ్చే ప్రేరణ కూడా కావాలి. ఆ పనినే ఓటీటీల్లోని ఈ టాప్ వెబ్ సిరీస్ చేస్తాయి. ఒకవేళ ఇప్పటికీ మీరు చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి.

కోటా ఫ్యాక్టరీ - నెట్‌ఫ్లిక్స్

కోటా ఫ్యాక్టరీ (Kota Factory) నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన వెబ్ సిరీస్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ కోసం రెడీ అయింది. ఐఐటీ-జేఈఈ ఆస్పిరెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. రాజస్థాన్ లోని కోటా దీనికి గమ్యస్థానం అన్న సంగతి తెలుసు కదా. అయితే ఐఐటీ లక్ష్యం మంచిదే అయినా.. అదే జీవితం కాదని చూపించడంతోపాటు విద్యార్థుల కలను సాకారం చేసే పేరుతో అక్కడి కోచింగ్ సెంటర్లు వాళ్లపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారో ఈ సిరీస్ ద్వారా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. స్టూడెంట్స్ తోపాటు పేరెంట్స్ కూడా చూడాల్సిన సిరీస్ ఇది.

ఆస్పిరెంట్స్ - ప్రైమ్ వీడియో

ఆస్పిరెంట్స్(Aspirants) ప్రైమ్ వీడియోలోని వెబ్ సిరీస్. దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష పాసవ్వాలని కలలు కనే లక్షలాది మంది ఆస్పిరెంట్స్ జీవితాలకు అద్దం పట్టే సిరీస్ ఇది. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చేశాయి. సివిల్స్ పాసవ్వాలని ఢిల్లీ వచ్చే ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత గొప్ప స్నేహితులుగా ఎలా మారారు? వాళ్ల కల నెరవేరిందా? సివిల్స్ లక్ష్యం సాధించాలంటే ఏం చేయాలి? ఎలా కష్టపడాలి? సివిల్స్ లక్ష్యం చెదిరినా మనోధైర్యం కోల్పోకుండా ఎలా ముందుకు సాగాలన్నది చాలా అద్భుతంగా ఈ సిరీస్ లో చూపించారు.

పిచర్స్ -జీ5 ఓటీటీ

పిచర్స్(The Pitchers) నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ. చదువు పూర్తయిన తర్వాత జీవితంలో తమ కాళ్లపై తాము నిలబడి గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే ఫ్రెండ్స్ చుట్టూ ఈ పిచర్స్ కథ నడుస్తుంది. జీ5, ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఈ సిరీస్ చూడొచ్చు.

పంచాయత్ - ప్రైమ్ వీడియో

భవిష్యత్తుపై ఎన్నో కలలతో, పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పని చేయాలన్న లక్ష్యంతో ఇంజినీరింగ్ చదవిన యువకుడు.. చివరికి ఓ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి ఎంపికై ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఆ తర్వాత అదే తన జీవితం అనుకొని ఆ ఊరి బాగుకోసం ఎలా శ్రమించాడు? అన్నది ఈ పంచాయత్ (Panchayat) సిరీస్ లో చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.

ఆపరేషన్ ఎంబీబీఎస్ - సోనీలివ్, యూట్యూబ్

ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్లుగా జీవితంలో సెటిల్ అవుదామని భావించే ముగ్గురు స్నేహితుల కథే ఈ ఆపరేషన్ ఎంబీబీఎస్. డాక్టర్ కావాలన్న కలను సాకారం చేసుకోవడానికి దేశంలోని ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదించినా.. ఆ తర్వాత అది ఎంత కఠినమైన దారో వాళ్లు తెలుసుకుంటారు. ఈ సిరీస్ సోనీలివ్, యూట్యూబ్ లలో చూడొచ్చు.

సెలెక్షన్ డే -నెట్‌ఫ్లిక్స్

జీవితంలో చదువు ఒక్కటే కాదు ఆటలతోనూ గొప్ప స్థాయికి చేరుకోవచ్చన్నది చాలా మంది చెప్పే మాట. అలా దేశంలో ఓ మతంగా భావించే క్రికెట్ లో కెరీర్ కోసం ఇద్దరు అన్నదమ్ములు పడే శ్రమను ఈ సెలెక్షన్ డే సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

హాఫ్ సీఏ - యూట్యూబ్, మినీ టీవీ

హాఫ్ సీఏ (Half CA) కూడా చాలా మంచి వెబ్ సిరీసే. కామర్స్ విద్యార్థులు కలలు కనే చార్టెర్డ్ అకౌంటెంట్ కోర్సు ఎంత కష్టమైందో.. అది పూర్తి చేయలేక ఎంత మంది స్టూడెంట్స్ హాఫ్ సీఏలుగా మిగిలిపోయారు ఈ వెబ్ సిరీస్ లో చాలా బాగా చూపించారు. యూట్యూబ్, అమెజాన్ మినీ టీవీలో ఈ సిరీస్ చూడొచ్చు.

IPL_Entry_Point