Good Friday 2024: ఏసుక్రీస్తు జీవితంపై వచ్చిన 3 బెస్ట్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..-best telugu christian movies to watch on good friday these films streaming on youtube karunamayudu to shanti sandesham ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Best Telugu Christian Movies To Watch On Good Friday These Films Streaming On Youtube Karunamayudu To Shanti Sandesham

Good Friday 2024: ఏసుక్రీస్తు జీవితంపై వచ్చిన 3 బెస్ట్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 28, 2024 02:32 PM IST

Good Friday 2024 - Christian Movies: గుడ్‍ ఫ్రైడే రోజన ఏసుక్రీస్తు గురించిన తెలుగు సినిమాలు చూడాలని అనుకుంటున్నారా.. ఈ మూడు చిత్రాలు ఉచితంగా స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు ఇవే..

Good Friday 2024: ఏసుక్రీస్తుపై జీవితంపై వచ్చిన 3 బెస్ట్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..
Good Friday 2024: ఏసుక్రీస్తుపై జీవితంపై వచ్చిన 3 బెస్ట్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

Good Friday 2024: క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్‍ ఫ్రైడే రేపు (మార్చి 28) ఉండనుంది. ఏసుక్రీస్తు సిలువ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడేను విశ్వసిస్తారు. ఏసుక్రీస్తు జీవితం గురించి తెలుగులోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. ఆయన ప్రజల ఎదుర్కొన్న కష్టాలను చూపించాయి. ఒకవేళ మీరు గుడ్‍ ఫ్రైడే రోజున క్రీస్తుకు సంబంధించిన తెలుగు సినిమాలు చూడాలనుకుంటున్నారా.. అయితే మూడు సినిమాలు యూట్యూబ్‍లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇవే..

కరుణామయుడు

కరుణామయుడు సినిమా ఓ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఏసుక్రీస్తు గురించి తెలుగులో వచ్చిన చిత్రాల్లో ఇదే అత్యంత పాపులర్ అయింది. చాలా ప్రజాదరణ పొందింది. 1978లో వచ్చిన కరుణామయుడు చిత్రంలో విజయ్ చందర్.. ఏసుక్రీస్తు పాత్రలో నటించారు. హాలీవుడ్ మూవీ ది కింగ్ ఆఫ్ కింగ్ చిత్రానికి స్ఫూర్తిగా తెరక్కించారు.

కరుణామయుడు సినిమాకు ఏ.భీమ్‍సింగ్, క్రిస్టోఫర్ సియెల్‍హో దర్శకత్వం వహించారు. తెలుగు డైలాగ్‍లను మోదుకూరి జాన్సన్ అందించారు. ఈ చిత్రాన్ని విజయ్ చందర్, లూయిస్ ఎఫ్ క్నోల్ నిర్మించారు. ఈ మూవీలో వెన్నీరా ఆడై నిర్మల, భీమ్‍సింగ్, చంద్రమోహన్, జగ్గయ్య, సురేఖ, రాజసులోచన కీలకపాత్రలు పోషించారు. జోసెఫ్ ఫెర్నాండెజ్, గోపాలం ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలు కూడా ఈ చిత్రం బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సినిమా మరికొన్ని భాషల్లోనూ డబ్బింగ్ అయింది.

కరుణామయుడు సినిమా ప్రస్తుతం యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది. ఆ వీడియో ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చు.

దయామయుడు

దయామయుడు చిత్రం 1987లో రిలీజ్ అయింది. కరుణామయుడు చిత్రానికి దీన్ని సీక్వెల్‍గా పరిగణించొచ్చు. ఈ చిత్రంలోనూ క్రీస్తుగా నటించారు విజయ్‍చందర్. మరోసారి ఆ పాత్రలో ఆయన మెప్పించారు. దయామయుడు మూవీలో చంద్రమోహన్, శ్యాంబాబు, తనికెళ్లభరణి, రమ్యకృష్ణ, భానుప్రకాశ్, సాక్షి రంగారావు, ఈశ్వరరావు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీతోనే నటి గౌతమి తెరంగేట్రం చేశారు.

దయామయుడు చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు విజయచందర్. రాధచిత్ర బ్యానర్ ఈ మూవీని నిర్మించింది. దయామయుడు సినిమా కూడా ప్రస్తుతం యూట్యూబ్ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉంది. ఫ్రీగానే చూడవచ్చు.

శాంతి సందేశం

సూపర్ స్టార్ కృష్ణ నటించిన శాంతి సందేశం సినిమా కూడా బాగా పాపులర్ అయింది. ఈ చిత్రంలో ఏసుక్రీస్తుగా కృష్ణ నటించారు. ఆ పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా ఓ క్లాసిక్‍గా నిలిచింది. ఈ మూవీకి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

శాంతి సందేశం మూవీలో రమ్యశ్రీ, సుమన్, వినోద్ కుమార్ అల్వా, కోట శ్రీనివాసరావు, రవళి, రంగనాథ్, జయప్రకాశ్ రెడ్డి, ఏవీఎస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. పద్మాలయా స్టూడియోస్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో ఏసుగా కృష్ణ నటన హైలైట్‍గా నిలిచింది. ఈ మూవీకి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. శాంతి సందేశం చిత్రం కూడా యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది.

శివ కృష్ణ, మురళీ మోహన్, సుధ ప్రధాన పాత్రలు పోషించిన యేసు మహిమలు సినిమా 2003లో రిలీజ్ అయింది. ఈ చిత్రం కూడా యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది.

IPL_Entry_Point