OTT Sports Dramas: ఓటీటీలోని బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాలు ఇవే.. క్రికెట్ నుంచి బాక్సింగ్ వరకు.. ఐపీఎల్‌కి ముందే చూసేయండి
OTT Sports Dramas: ఓటీటీలో ప్రేక్షకులు మెచ్చే ఎన్నో స్పోర్ట్స్ డ్రామాస్ ఉన్నాయి. సోనీలివ్, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. క్రికెట్ నుంచి బాక్సింగ్ వరకు మనతో స్ఫూర్తి నింపే ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలేంటో చూడండి.
OTT Sports Dramas: ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ఏంటో ఇక్కడ చూడండి. ఈ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాలు.. మంచి వినోదాన్ని అందించడంతోపాటు మనలో స్ఫూర్తిని కూడా నింపుతాయి. ఐపీఎల్ క్రేజ్ మధ్య ఇక్బాల్, జెర్సీలాంటి మరిన్ని బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాలను ఓటీటీలో చూడండి.
83 - నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్
ఈ 83 మూవీ ఇండియన్ క్రికెట్ టీమ్ 1983లో గెలిచిన వరల్డ్ కప్ నేపథ్యంలో సాగుతుంది. అసలు ఏమాత్రం అంచనాలు లేని టీమిండియా కపిల్ దేవ్ సారథ్యంలో ఎలా విశ్వవిజేతగా మారిందో కళ్లకు కట్టినట్లు చూపించిన మూవీ ఇది. కపిల్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించాడు. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ లలో అందుబాటులో ఉంది.
జెర్సీ - జీ5 ఓటీటీ
జెర్సీ మూవీ 2019లో వచ్చిన తెలుగు స్పోర్ట్స్ డ్రామా. ఓ విఫల క్రికెటర్ అయిన అర్జున్ (నాని) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను తన 30ల చివర్లో తన కొడుకు జెర్సీ కోరికను నెరవేర్చడంతోపాటు తనను తాను నిరూపించుకోవాలనే తపనతో వదలేసిన క్రికెట్ కెరీర్ ను మళ్లీ మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు.
అయితే ఈ క్రమంలో అతడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. ఓవైపు తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఓ క్రికెటర్ గా తనను తాను నిరూపించుకోవడానికి, తన కొడుకు కలను నెరవేర్చడానికి అతడు చేసే ప్రయాణాన్ని జెర్సీలో చూడొచ్చు.
ఇక్బాల్ - జీ5 ఓటీటీ
ఇక్బాల్ ఓ మూగ, చెవిటి బాలుడి చుట్టూ తిరిగే కథ. తన అంగ వైకల్యాన్ని అధిగమించి, తన తండ్రికి తనపై ఉన్న వ్యతిరేక భావాన్ని జయించి ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఆడాలని కలలు కంటాడు. ఈ తపనే అతన్ని ఓ కోచ్ కోసం వెతికేలా చేసి, క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టేలా చేస్తుంది.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడే .. ఇక్బాల్ పాత్రలో నటించాడు. అతని కోచ్ గా నసీరుద్దీన్ షా కనిపించాడు. ఇది మంచి స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామా. జీ5 ఓటీటీలో చూడొచ్చు.
సాలా ఖడూస్ - సోనీలివ్ ఓటీటీ
సాలా ఖడూస్ ఒక మాజీ బాక్సర్ ఆది తోమర్ (ఆర్. మాధవన్) చుట్టూ తిరిగే కథ. అతను ఓ యువ, అంతగా పదునులేని మహిళా బాక్సర్ మాధి (రితికా సింగ్)కి కోచ్‌గా మారి, ఆమె ఛాంపియన్‌గా ఎదగడానికి సహాయం చేస్తాడు. ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు.
మాధికి మార్గదర్శకత్వం చేయడం ద్వారా తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కోసం ఆది చూస్తుంటాడు. ఇది క్రీడా ప్రపంచంలోని రాజకీయాలు, అవినీతి సమస్యలను, అలాగే క్రీడలలో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను కూడా హైలైట్ చేస్తుంది.
ముక్కాబాజ్ - జీ5 ఓటీటీ
అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ముక్కాబాజ్ మూవీ.. శ్రావణ్ అనే ఆశావహ బాక్సర్ గురించి చెప్పే స్పోర్ట్స్ డ్రామా. అతను ఓ శక్తివంతమైన, అవినీతి బాక్సింగ్ ప్రమోటర్ భగవాన్ దాస్ మిశ్రా మేనకోడలు సునైనాను ప్రేమిస్తాడు.
తన కలను నెరవేర్చుకోవడానికి ఉన్న సామాజిక అడ్డంకులు, అవినీతిని అధిగమించడానికి పోరాడుతాడు. ఈ మూవీ ప్రేమ, ద్వేషం, పట్టుదల, క్రీడా స్ఫూర్తి, అలాగే క్రీడా ప్రపంచంలోని కులతత్వం, అవినీతి, బంధుప్రీతి వంటి సమస్యలను చర్చిస్తూ సాగుతుంది. మంచి బాక్సాఫీస్ హిట్ అందుకున్న సినిమా ఇది.
ఝుండ్ - జీ5 ఓటీటీ
ఝుండ్ స్లమ్ సాకర్ ఫౌండర్ అయిన విజయ్ బార్సే బయోపిక్. ఇందులో ఆయన పాత్రలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నటించాడు. స్లమ్ ఏరియాలోని పిల్లలను ఫుట్‌బాల్ వైపు ఆకర్షితులయ్యేలా చేసి, వారిని ఛాంపియన్లుగా నిలిపిన ఘనత విజయ్ బార్సే సొంతం.
అలాంటి స్ఫూర్తిదాయక జీవితాన్నే సినిమాగా ఝుండ్ పేరుతో 2022లో తీశారు. మురికివాడల్లో పేదరికం, హింస, డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడిన యువతలో ఫుట్‌బాల్ ఎలాంటి మార్పు తీసుకొస్తుందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం