Best Psychological Thrillers: జీ5 ఓటీటీలో ఉన్న టాప్ 5 బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే..
Best Psychological Thrillers: సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. జీ5 ఓటీటీలోనూ ఈ జానర్ మూవీస్ కొన్ని మిస్ కాకుండా చూడాల్సినవి ఉన్నాయి. వాటిలో టాప్ 5 మూవీస్ ఏంటో ఇక్కడ చూడండి.
Best Psychological Thrillers: ఓటీటీ అంటేనే థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ లాంటి జానర్ల సినిమాలు, వెబ్ సిరీస్ లకు కేరాఫ్. వీటిని ఆదరించే ప్రేక్షకులు కూడా ఎక్కువే. మరి ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జీ5లో ఉన్న టాప్ 5 బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలేంటో చూసేయండి.
రామన్ రాఘవ్ 2.0
రామన్ రాఘవ్ 2.0 మూవీ జీ5 ఓటీటీలో ఉన్న బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి. ఈ మూవీ ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతని పేరు రామన్న. 1960లనాటి సీరియల్ కిల్లర్ రామన్ రాఘవే ఈ పాత్రకు స్ఫూర్తి. ఇక అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ రాఘవన్ చుట్టూ కూడా ఈ మూవీ తిరుగుతుంది. అతడో డ్రగ్ అడిక్ట్. ఈ ఇద్దరి చుట్టూ తిరిగే ఈ రామన్ రాఘవ్ 2.0 మూవీ మంచి థ్రిల్ ను పంచుతుంది.
బరోట్ హౌస్
హిందీలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ బరోట్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. వాళ్ల ఇద్దరు కూతుళ్లు హత్యకు గురైన తర్వాత వాళ్లు చాలా బాధాకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఈ కథ ఆ ఫ్యామిలీ మీద ముఖ్యంగా అమిత్ బరోట్ (అమిత్ సాధ్), అతని భార్య భావన (మంజరి ఫడ్నిస్) మీద ఆ సంఘటనల వల్ల కలిగే మానసిక ప్రభావం గురించి చూపిస్తుంది.
పోషమ్ పా
పోషమ్ పా మరో హిందీ సైకలాజికల్ థ్రిల్లర్. దీనిని ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తీశారు. ఒక తల్లి, ఆమె ముగ్గురు కూతుళ్లు చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేస్తారు. ఈ సినిమాలో మహి గిల్, సయానీ గుప్తా, రాగిణి ఖన్నా నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ బంధాల్లోని చీకటి కోణాన్ని, నేరాల వల్ల కలిగే భయంకరమైన పరిణామాల్ని చూపిస్తుంది.
చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్
దుల్కర్ సల్మాన్, సన్నీ డియోల్, శ్రేయా ధన్వంతరి, పూజా భట్ నటించిన చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కథ ముంబైలో అవినీతిపరులైన సినిమా విమర్శకులను టార్గెట్ చేసే ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కళాకారులు, విమర్శకుల మధ్య ఉండే సంబంధాన్ని, ఒక కళాకారుడి మనసు మీద విమర్శల ప్రభావం ఎలా ఉంటుందో చూపిస్తుంది.
ఫోబియా
ఫోబియా కథ మెహక్ (రాధిక ఆప్టే) అనే ఒక ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఆమెను ఎవరో వేధించిన తర్వాత ఆమెకు అగోరాఫోబియా (బయటికి వెళ్లాలంటే భయం) వస్తుంది. తన స్నేహితుడు ఆమెకు సహాయం చేయడానికి ఆమె అపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు, ఆమెకు కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ అపార్ట్‌మెంట్‌లో దెయ్యాలు ఉన్నాయని భయపడుతుంది. ఈ కథ హింసకు గురైన మహిళల మానసిక గాయం, భయం వంటి విషయాల గురించి ఉంటుంది.
సంబంధిత కథనం