OTT Movies: ఓటీటీలో స్ఫూర్తినింపే టాప్ 4 దేశభక్తి సినిమాలు- రిపబ్లిక్ డే, వీకెండ్‌కు ఫ్యామిలీతో బెస్ట్- అన్నీ కొత్తవే!
Patriotic OTT Movies To Watch On Republic Day 2025: ఓటీటీలో స్ఫూర్తి నింపే దేశభక్తి సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ, వాటన్నింటిలో ఈ గణతంత్ర దినోవత్సవం (జనవరి 26) రోజున ఫ్యామిలీతో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేసేందుకు టాప్ 5 ఓటీటీ సినిమాలను సజెషన్ కింద ఇక్కడ తెలుసుకోండి. అన్నీ 2024లో రిలీజ్ అయిన కొత్త సినిమాలే.
OTT Movies To Watch On Republic Day 2025 And Weekend: జనవరి 26 రిపబ్లిక్ డే. గణతంత్ర దినోవత్సం అయిన ఆదివారం రోజున దేశవ్యాప్తంగా ప్రజల నాడులు దేశభక్తితో నిండిపోతాయి. సాధారణంగా ఎలా ఉన్న ఈ ఆదివారం (జనవరి 26) మాత్రం అంతా భారత్ మాతా కీ జై కొడతారు.
అయితే, రిపబ్లిక్ డే హాలీడే, పైగా ఆదివారం వీకెండ్ కావడంతో గణతంత్ర దినోత్సవాన్ని పలు విధాలుగా జరుపుకుంటారు. అయితే, మంచి సినిమాలతో కాలక్షేపం చేయాలనుకునేవారి కోసమే ఈ స్టోరీ. దేశభక్తితోపాటు మంచి స్ఫూర్తినింపే ఓటీటీ సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఫ్యామిలీతో ఈ వీకెండ్‌కు ఇంట్లోనే కూర్చుని మంచి టైమ్ పాస్ చేయాలనుకునేవారు ఈ ఓటీటీ మూవీస్‌పై లుక్కేయండి.
అమరన్
శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీగా నటించిన ఎమోషనల్ ప్యామిలీ డ్రామా చిత్రం అమరన్. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీ చిత్రంగా తెరకెక్కిన అమరన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్‌తోపాటు లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో కట్టిపడేస్తుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ భాషల్లో అమరన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీతో చూసేందుకు అమరన్ చాలా మంచి చిత్రం అని చెప్పుకోవచ్చు. కాగా 2024లో రిలీజ్ అయిన అమరన్ 8.2 ఐఎమ్‌డీ రేటింగ్ తెచ్చుకుంది.
రజాకార్
అనసూయ భరద్వాజ్, వేదిక, బాబీ సింహా, ఇంద్రజ, ప్రేమ, రాజ్ అరుణ్, మకరంద్ దేశ్ పాండే, అనుశ్రియ త్రిపాఠీ, జాన్ విజయ్ వంటి ఎంతోమంది ప్రతిభావంతులు నటించిన పీరియాడికల్ మూవీ రజాకార్. స్వాతంత్య్ర దినోత్సవం కంటే ముందు తెలంగాణలో రజాకార్‌ల అక్రమాలు, దౌర్జన్యాలపై తెరకెక్కిన రజాకార్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే, కాస్తా వయెలెంట్‌గా ఉన్న ఈ సినిమాను పిల్లలతో చూడటం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇక రజాకార్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 7.9 రేటింగ్ వచ్చింది.
మైదాన్
2024లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా హిందీ చిత్రం మైదాన్. అజయ్ దేవగన్ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా క్రీడా స్ఫూర్తిని పెంపొదించి మనలో దేశభక్తి నింపుతుంది. అందుకే, అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, హిందీ, తమిళ ఇతర భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మైదాన్‌ను ఎంచక్కా చూసేయొచ్చు. ఈ సినిమా కలెక్షన్స్ తెచ్చిపెట్టకపోయినప్పటికీ 7.9 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించింది.
చందు ఛాంపియన్
ఇండియన్ ఆర్మీ సైనికుడి నుంచి రెజ్లర్, బాక్సర్, యుద్ధ వీరుడు, స్విమ్మర్‌గా ఎన్నో రంగాల్లో రాణించిన భారతీయ తొలి పారాలింపిక్స్ స్వర్ణ విజేత మురళీకాంత్ పేట్కర్ బయోపిక్‌గా తెరకెక్కిన సినిమా చందు ఛాంపియన్. అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో స్ఫూర్తివంతంగా చెప్పే ఈ బయోగ్రఫికల్ స్పోర్ట్స్ యాక్షన్ హిందీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
7.8 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన చందు ఛాంపియన్ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. పలక్ లల్వానీ, భువన అరోరా, విజయ్ రాజ్, సోనాలి కులకర్ణి, సోనియా గోస్వామి ఇతర కీలక పాత్రల్లో నటించారు.