OTT Thrillers: ఓటీటీలో అదరగొట్టే తమిళ క్రైమ్ సస్పెన్స్ సినిమాలు.. ఎక్కడెక్కడ చూస్తారంటే?
OTT Tamil Thriller Movies Telugu: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తెరకెక్కించడంలో మలయాళం, తమిళ మేకర్స్ దిట్ట అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ కాన్సెప్టుతో సీడ్ ఎడ్జ్‌లో కూర్చెబెట్టే కథనంతో సాగుతుంటాయి. అలా ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే బెస్ట్ ఓటీటీ తమిళ థ్రిల్లర్ మూవీస్ ఏంటో చూద్దాం.
Best Tamil Thrillers In OTT: ఏ జోనర్ ఉన్నప్పటికీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ స్పెషల్‌గా ఉంటాయి. ఆద్యంతం ఆకట్టుకునే కథనంతో ట్విస్టులు ఇస్తూ సాగే మూవీని ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌కు తమిళ చిత్ర పరిశ్రమ కూడా పెట్టింది పేరు. మరి ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే తమిళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఓటీటీలో దొరికే బెస్ట్ థ్రిల్లర్స్‌పై ఓ లుక్కేద్దాం.
కే 13 (K-13 Movie)
కే 13 మూవీ ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్. 2019లో వచ్చిన ఈ సినిమాను భరత్ నీలకంఠన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో అరుళ్ నిధి, శ్రద్ధా శ్రీనాథ్, అధిక్ రవిచంద్రన్, గాయత్రి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మదియ జగన్ అనే ఓ డిప్రెస్‌డ్ ఫిల్మ్ మేకర్ రోజు బార్‌కు వెళ్తుంటాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి అట్రాక్ట్ అవుతాడు. కట్ చేస్తే ఓ గదిలో తను కట్టేసి ఉంటే.. ఆ అమ్మాయి మాత్రం చనిపోయి ఉంటుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే మది చేసే ప్రయత్నమే కే 13. ఈ మూవీ జియో సినిమా, సన్ ఎన్‌ఎక్స్‌టీలో స్ట్రీమింగ్ అవుతోంది.
డి బ్లాక్ (D Block Movie)
2022లో వచ్చిన డి బ్లాక్ మూవీ ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్న యూనివర్స్‌లో జరుగుతుంటుంది. ఇక్కడ ఎన్నో భయానక సంఘటనలు, తెలియని నేరాలు జరుగుతుంటాయి. వాటిని మెనేజ్‌మెంట్ కప్పిపుచ్చుతూ ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ ఇస్తుంది. అయితే, ఆ యూనివర్సిటీకి ఒకవైపు లేడీస్ హాస్టల్, మరోవైపు బాయ్స్ హాస్టల్ ఉంటుంది. మధ్యలో ఉన్న డి బ్లాక్‌కు వెళ్లొద్దని హెచ్చరిస్తుంది యాజమాన్యం. కానీ, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అటువైపు వెళ్తారు. అప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయన్నదే స్టోరీ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
రేయికి వేయి కళ్లు
రేయికి వేయి కళ్లు తెలుగు డబ్బ్‌డ్ తమిళ సినిమా. ఒక నైట్‌లో జరిగిన మర్డర్‌కు చాలా వెర్షన్స్ ఉంటాయి. అలా ఆ మర్డర్ ఎవరు చేశారు, ఏది నిజం, ఎన్నో ఇంటర్‌లింక్ స్టోరీస్‌తో చాలా గ్రిప్పింగ్‌గా చూపించే సినిమా ఇది. ఓ ట్యాక్సీ డ్రైవర్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంటుంది. ఆ మర్డర్‌లో డ్రైవర్ ఎలా చిక్కుకున్నాడు.. ఆ ప్లాట్‌ను ఎలా కనిపెట్టాడు అనేది సినిమా కథ. చివరి వరకు క్లైమాక్స్ రివీల్ కానీ ఈ సినిమా మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. రేయికి వేయి కళ్లు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆరతు సినమ్ (Aarathu Sinam)
ఆరతు సినిమ్ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్. ఇది దృశ్యం చిత్రాల డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ మెమోరీస్‌కు రీమేక్. మంచి ఎమోషన్స్ అండ్ గ్రిప్పింగ్‌గా సాగే సినిమా. ఇందులో అరుళ్ నిధి, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా జియో సినిమా ఓటీటీలో ఫ్రీగా అందుబాటులో ఉంది. అలాగే సన్ ఎన్‌ఎక్స్‌టీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
డైరీ (Diary Movie)
డైరీ సినిమా ఒక క్రైమ్ సబ్జెక్ట్. కానీ, హారర్, సెంటిమెంట్, థ్రిల్లర్ ఇలా అన్ని జోనర్స్ మిక్స్ చేసి తెరకెక్కించిన సినిమా. ఇది ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇందులో అరుళ్ నిధి, పవిత్ర మరిముత్తు, సెంథీ కుమారి కీలక పాత్రలు పోషించారు. కానీ, ఈ మూవీ తెలుగులో కాకుండా ఆహా తమిళ ఓటీటీలో అందుబాటులో ఉంది.