Best OTT Movies: ఈ 2 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన 29 సినిమాలు.. ఒక్కదాంట్లో 16.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 5 మాత్రమే!-best ott movies of this week releases on netflix amazon prime etv win sony liv like anuja rekhachithram 54321 baby john ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Best Ott Movies: ఈ 2 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన 29 సినిమాలు.. ఒక్కదాంట్లో 16.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 5 మాత్రమే!

Best OTT Movies: ఈ 2 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన 29 సినిమాలు.. ఒక్కదాంట్లో 16.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 5 మాత్రమే!

Sanjiv Kumar HT Telugu
Published Feb 06, 2025 09:17 AM IST

OTT Best Movies Of This Week Releases: ఓటీటీలోకి ఇవాళ, నిన్న కలిపి మొత్తంగా 29 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే 16 రిలీజ్ అయ్యాయి. అయితే, మొత్తం 29లో చూడాల్సిన బెస్ట్ సినిమాలుగా 5 మాత్రమే ఉన్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీలు ఏంటీ ఇక్కడ తెలుసుకుందాం.

ఈ 2 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన 29 సినిమాలు.. ఒక్కదాంట్లో 16.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 5 మాత్రమే!
ఈ 2 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన 29 సినిమాలు.. ఒక్కదాంట్లో 16.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 5 మాత్రమే!

OTT Best Movies Of This Week Releases: ఓటీటీలోకి ప్రతి వారం డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ఎక్కువ సంఖ్యలో స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. ఒకటి, రెండు కచ్చితమైన రోజులో ఎక్కువ ఈ ఓటీటీ రిలీజ్‌లు ఉంటాయి. అయితే, ఈ వారం రోజుకోకటి చొప్పున మంచి థ్రిల్ అందించే సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి.

అలా, నిన్న (ఫిబ్రవరి 5), ఇవాళ (ఫిబ్రవరి 6) చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, సన్ ఎన్ఎక్స్‌టీ, ఈటీవీ విన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ రెండురోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలపై లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

అనూజ (అమెరికన్ హిందీ షార్ట్ ఫిల్మ్) - ఫిబ్రవరి 5

ప్రిజన్ సెల్ 211 (హాలీవుడ్ సర్వైవల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 5

సెలబ్రిటీ బేర్ హంట్ (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటిషన్ షో)- ఫిబ్రవరి 5

ఆపిల్ సైడర్ వెనిగర్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 6

ది ఆర్ మర్డర్స్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6

కసాండ్రా (జెర్మనీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

బేబీ జాన్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 5

54321 (తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 5

ఇన్విసిబుల్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6

రేఖా చిత్రం (మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి 5

లవ్ యు టు డెత్ (స్పానిష్ రొమాంటిక్ చిత్రం)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- ఫిబ్రవరి 5

మెడికల్ డ్రీమ్స్ (హిందీ వెబ్ సిరీస్) గర్లియప్ప యూట్యూబ్ ఛానెల్- ఫిబ్రవరి 5

బ్రేకప్ కహానీ (హిందీ అంథాలజీ లవ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- సన్ ఎన్ఎక్స్‌టీ- ఫిబ్రవరి 5

ఈటీవీ విన్ ఓటీటీ మూవీస్

అలాగే, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 6) అలా మొదలైంది, అతడు, బేవర్స్, బిచ్చగాడా మజాకా, బ్లఫ్ మాస్టర్ట్, బాడీ గార్డ్, క్రేజీ ఫెలో, ఫిదా, ఖాకీ, మోసగాళ్లకు మోసగాడు, ఊరు పేరు భైరవకోన, పాండురంగడు, సింహా, తరువాత ఎవరు, టాప్ గేర్, వాన వంటి 16 సినిమాలు 4కే, డీబీ ప్లస్ ఆడియో క్వాలిటీతో రిలీజ్ అయ్యాయి.

13 ఓటీటీ స్ట్రీమింగ్

ఇలా ఇవాళ, నిన్న కలిపి రెండు రోజుల్లోనే 13 సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో అమెరికన్ హిందీ షార్ట్ ఫిల్మ్, ఆస్కార్‌కు నామినేట్ అయిన అనూజ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. అలాగే, కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బేబీ జాన్, తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా 54321, మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రేఖా చిత్రం చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

ఐదు చాలా స్పెషల్

ఈ మూడు సినిమాలతో పాటు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ అవుతోన్న మెడికల్ డ్రీమ్స్, నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ది ఆర్ మర్డర్స్ వంటి వెబ్ సిరీసులు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. ఇలా ఈ రెండు రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయిన వాటిలో 3 సినిమాలు, 2 వెబ్ సిరీస్‌లతో ఐదు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం