OTT Thriller Movies: ఓటీటీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?-best malayalam cop thrillers on ott rekhachithram thalavan mumbai police kannur squad on netflix sony liv jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Movies: ఓటీటీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

OTT Thriller Movies: ఓటీటీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

OTT Thriller Movies: మలయాళంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ కు అసలు కొదవే లేదు. ప్రస్తుతం ఓటీటీలో అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి అవేంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

ఓటీటీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

OTT Thriller Movies: మలయాళం సినిమాలో ఈ రోజుల్లో థ్రిల్లర్స్ బాగా నడుస్తున్నాయి. అందులోనూ మలయాళం పోలీస్ థ్రిల్లర్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్.. ఆసిఫ్ అలీ, బిజు మీనన్ నటించిన తలవన్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ముంబై పోలీస్ నుండి దుల్కర్ సల్మాన్ నటించిన సెల్యూట్ వరకు బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకోండి.

రేఖాచిత్రం - సోనీ లివ్ ఓటీటీ

ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన మూవీ రేఖాచిత్రమ్. ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ ఇది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన రేఖాచిత్రమ్‌లో, పోలీసులు ఒక అస్థిపంజరం కనుగొన్న తర్వాత అసలు బాధితులెవరో తెలుసుకునే ప్రయత్నం మొదలవుతుంది.

40 ఏళ్ల కిందట ఈ కేసును సస్పెండ్ అయి మళ్లీ అప్పుడే డ్యూటీలో చేరిన ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడన్నదే మూవీ స్టోరీ. మంచి థ్రిల్ పంచే మూవీ ఇది.

ముంబై పోలీస్ - జియోహాట్‌స్టార్

రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ముంబై పోలీస్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఏసీపీ ఆంటోనీ మోసెస్ గా నటించాడు. జయసూర్య, రెహమాన్ సీనియర్ పోలీస్ పాత్రల్లో నటించారు.

ఒక స్నేహితుడి హత్య కేసులో హంతకుడిని పట్టుకునే ఆంటోనీకి యాక్సిడెంట్ జరిగి గతం మరచిపోతాడు. మళ్లీ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి హంతకుడిని పట్టుకోవాలి. అసాధారణ క్లైమాక్స్ ఉన్న ఈ సినిమా పోలీస్ థ్రిల్లర్ నచ్చే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనడంలో సందేహం లేదు.

కన్నూర్ స్క్వాడ్ - జియోహాట్‌స్టార్

మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి ఈ కన్నూర్ స్క్వాడ్‌లో ఏఎస్ఐ జార్జ్ మార్టిన్‌గా నటించాడు. అతను, అతని పోలీసు గ్రూపు ఒక నేర ముఠాని పట్టుకోవడానికి బయలుదేరుతారు. ఈ క్రమంలో వాళ్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. చివరికి ఓ ముఠాని పట్టుకుంటారా లేదా అన్నదే ఈ సినిమా స్టోరీ. బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించిన మూవీ ఇది.

తలవన్ - సోనీ లివ్ ఓటీటీ

మలయాళ సీనియర్ నటులు బిజు మీనన్, ఆసిఫ్ అలీ నటించిన మూవీ తలవన్. ఒకే పోలీస్ స్టేసన్ లో పని చేసే ఓ సీఐ, ఎస్ఐకి అస్సలు పడదు. కానీ సీఐ ఇంట్లో దొరికిన శవం స్టోరీ మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ కేసులో సీఐ పరిస్థితి అర్థం చేసుకున్న ఎస్ఐ అతని అండగా ఉంటూ.. అసలు ఆ శవం అతని ఇంట్లోకి ఎలా వచ్చిందన్నదానిపై ఇన్వెస్టిగేషన్ జరుపుతాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మలుపులతో సాగే మూవీ.

సెల్యూట్ - సోనీ లివ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మూవీ సెల్యూట్. రోషన్ ఆండ్రూస్, బాబీ-సంజయ్ కలిసి ఈ సినిమాని తీశారు. ఇందులో ఎస్ఐ అరవింద్ కరుణాకరన్‌గా దుల్కర్ నటించాడు. అతను, ఇతర పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇరికిస్తారు. కానీ తన తప్పు తెలుసుకున్న పోలీస్, నిజం బయటపెట్టాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడాలి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం