Malayalam Action comedy movies: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ మలయాళం యాక్షన్ కామెడీ సినిమాలు ఇవే
Malayalam Action comedy movies: మలయాళంలో మరో రూ.100 కోట్ల సినిమాగా భావిస్తున్న ఆవేశంలాంటివే కొన్ని ఇంట్రెస్టింగ్ యాక్షన్ కామెడీ సినిమాలు ఓటీటీల్లో ఉన్నాయి. అవేంటో, ఎక్కడ చూడాలో ఒకసారి చూడండి.
Malayalam Action comedy movies: మలయాళం సినిమా ఇండస్ట్రీ ఈ ఏడాది జోరు మీద ఉంది. ఏ జానర్ సినిమా తీసినా సులువుగా రూ.100 కోట్లు దాటేస్తోంది. తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన యాక్షన్ కామెడీ మూవీ ఆవేశం కూడా ఇప్పుడు రూ.100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో ఇప్పటికే ఉన్న ఈ యాక్షన్ కామెడీ జానర్ మలయాళ సినిమాలు ఏమున్నాయో మీరే చూడండి.
ఓటీటీల్లోని యాక్షన్ కామెడీ మలయాళం సినిమాలు
ఈ ఏడాది మలయాళం నుంచి అన్వేషిప్పిన్ కండెతుమ్, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడుజీవితం, ఆవేశంలాంటి సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్, సర్వైవల్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, యాక్షన్ కామెడీ జానర్లలోని సినిమాలు ఇవి. తాజాగా వచ్చిన ఆవేశంలాంటి సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో కొన్ని ఉన్నాయి.
రాజమాణిక్యం - సన్ నెక్ట్స్
మమ్ముట్టి, సాయికుమార్ నటించిన మూవీ రాజమాణిక్యం. ఇప్పుడు ఆవేశం మూవీ కోప్రొడ్యూసర్ గా ఉన్న అన్వర్ రషీద్ డైరెక్టర్ గా తీసిన తొలి సినిమా ఇది. 2005లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్. ఈ యాక్షన్ కామెడీ మూవీలో ఓ నిరక్షరాస్య వ్యాపారవేత్త పాత్రలో మమ్ముట్టి ఆకట్టుకున్నాడు. ఈ మూవీని సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.
ఛోటా ముంబై - సన్ నెక్ట్స్
మోహన్ లాల్ నటించిన ఈ ఛోటా ముంబై మూవీని కూడా అన్వర్ రషీదే డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కూడా సన్ నెక్ట్స్ ఓటీటీలోనే అందుబాటులో ఉంది. ఓ స్థానిక గూండా వాస్కోడిగామా పాత్రలో మోహన్ లాల్ నటించాడు. మంచి యాక్షన్ కామెడీ మూవీ కావాలంటే ఈ ఛోటా ముంబై చూడొచ్చు.
తుండు - నెట్‌ఫ్లిక్స్
మలయాళ కామెడీ మూవీ తుండు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బిజు మేనన్ ఇందులో నటించాడు. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
రొమాంచం - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
రొమాంచం కూడా ఓ యాక్షన్ కామెడీ జానర్ మూవీయే. బాక్సాఫీస్ దగ్గర రూ.70 కోట్లతో అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. హారర్ కు కామెడీ కూడా జోడించి తీసిన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.
కుంబలంగి నైట్స్ - ప్రైమ్ వీడియో
కుటుంబ బంధాల గొప్పతనాన్ని చాటుతూనే కామెడీ పండించే మూవీ కుంబలంగి నైట్స్ మూవీ. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఉంది. కుంబలంగి అనే ఊళ్లో జీవించే నలుగురు అన్నదమ్ముల చుట్టూ తిరిగే కథ ఇది.
సీఐడీ మూసా - సన్ నెక్ట్స్
జానీ ఆంటోనీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దిలీప్, మురళీ, ఆశిష్ విద్యార్థిలాంటి వాళ్లు నటించారు. బాక్సాఫీస్ దగ్గరే కాదు టీవీల్లోనూ అత్యధిక వ్యూయర్షిప్ సంపాదించిన మలయాళం సినిమాల్లో ఒకటైన ఈ సీఐడీ మూసా మూవీని సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.