OTT Telugu Movies: కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ థియేటర్లలోనే కాదు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రియదర్శి ఓ లాయర్ గా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. పోక్సో చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ సినిమా కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా మీకు కూడా నచ్చిందా? ఇలాంటివే తెలుగులో మరికొన్ని మూవీస్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూడండి.
పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ కోర్ట్ రూమ్ డ్రామా వకీల్‌సాబ్. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకు ఇది రీమేక్. ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది. ఆ అమ్మాయిలను బలవంతం చేయబోయిన యువకులు, వాళ్లకు శిక్ష పడేలా చేసే ఓ వకీలు కథే ఈ మూవీ.
సూర్య నటించిన ఈ తమిళ సినిమా దేశాన్ని ఊపేసింది. దేశంలో ఇప్పటికే కుల వివక్ష, పోలీసుల దౌర్జన్యం, న్యాయం కోసం వాళ్లు చేసే పోరాటం చుట్టూ తిరిగే కథే ఈ జై భీమ్. తెలుగులోనూ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
మలయాళ మూవీ జన గణ మన. ఈ సినిమా తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన సినిమా ఇది. గుడ్డి దేశభక్తి, మీడియా ప్రభావంపై రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కూడా మీ కోర్ట్ రూమ్ డ్రామాస్ లిస్టులో ఉండాలి.
అల్లరి నరేష్ నటించిన మూవీ నాంది. ఎన్నో ఏళ్ల పాటు తప్పుడు శిక్ష అనుభవించిన ఓ ఖైదీ చేసే న్యాయపోరాటమే ఈ నాంది మూవీ. ఈ సినిమాను ఆహా వీడియోలో చూడొచ్చు. ఓ కమెడియన్ గా పేరుగాంచిన నరేష్.. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు.
విశ్వక్సేన్ నటించిన మూవీ ముఖచిత్రం. ఓ ప్లాస్టిక్ సర్జన్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. తన భార్య ముఖాన్ని తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ కు మార్చడం అతని జీవితాన్ని ఎలా మార్చిందన్నది ఈ లీగల్ డ్రామాలో చూడొచ్చు. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
సాయి పల్లవి నటించిన మూవీ గార్గి. ఓ తప్పుడు కేసులో ఇరుక్కున్న తన తండ్రిని కాపాడుకునేందుకు ఆమె చేసే పోరాటం ఈ సినిమాలో చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం