Allu Arjun Top 7 Movies on OTT: ఓటీటీలో ఉన్న అల్లు అర్జున్ టాప్ 7 ఐఎండీబీ రేటింగ్ మూవీస్ ఇవే-best allu arjun movies on ott top 7 imdb rating movies of icon star allu arjun ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Top 7 Movies On Ott: ఓటీటీలో ఉన్న అల్లు అర్జున్ టాప్ 7 ఐఎండీబీ రేటింగ్ మూవీస్ ఇవే

Allu Arjun Top 7 Movies on OTT: ఓటీటీలో ఉన్న అల్లు అర్జున్ టాప్ 7 ఐఎండీబీ రేటింగ్ మూవీస్ ఇవే

Hari Prasad S HT Telugu

Allu Arjun Top 7 Movies on OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీస్ లో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ ఉన్న టాప్ 7 సినిమాలు ఏవి? అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రైమ్ వీడియో, జీ5, సన్ నెక్ట్స్, జియోహాట్‌స్టార్, సోనీ లివ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.

ఓటీటీలో ఉన్న అల్లు అర్జున్ టాప్ 7 ఐఎండీబీ రేటింగ్ మూవీస్ ఇవే

Allu Arjun Top 7 Movies on OTT: అల్లు అర్జున్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించాడు. అయితే వాటిలో ప్రేక్షకులు ఇచ్చిన ఐఎండీబీ రేటింగ్ ప్రకారం.. టాప్ 7 మూవీస్ ఏవో మీకు తెలుసా? ప్రస్తుతం అవి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి.

మంగళవారం (ఏప్రిల్ 8) తన 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ స్టార్ హీరో కెరీర్లోనే బెస్ట్ 7 మూవీస్ ఏవో చూద్దాం. వీటిలో చాలా వరకు అతడు సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసిన సినిమాలే కావడం విశేషం.

వేదం - ఎంఎక్స్ ప్లేయర్

క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన వేదం మూవీకి ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది. అనుష్క, మంచు మనోజ్ లాంటి వాళ్లు కూడా నటించిన ఈ సినిమా ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఉంది. బన్నీ కెరీర్లో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ ఉన్న మూవీ ఇదే.

ఆర్య - జీ5 ఓటీటీ

అల్లు అర్జున్ కెరీర్లో తొలి మెగా హిట్ మూవీ ఆర్య. ఎప్పుడో 21 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు ఐఎండీబీలో 7.8 రేటింగ్ ఉంది. ఈ సినిమాను ప్రస్తుతం జీ5 ఓటీటీలో చూడొచ్చు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది.

పుష్ప ది రైజ్ - అమెజాన్ ప్రైమ్ వీడియో

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ పుష్ప ది రైజ్. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దాని సీక్వెల్ కంటే మంచి ఐఎండీబీ రేటింగ్ ఉంది.

ఆర్య 2 - ప్రైమ్ వీడియో

ఇది కూడా బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే. ఆర్య మూవీకి సీక్వెల్ ఆర్య 2. ఈ మూవీకి 7.5 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆర్య 2 స్ట్రీమింగ్ అవుతోంది. కాజల్, నవదీప్ కూడా ఈ సినిమాలో నటించారు.

అలవైకుంఠపురంలో - సన్ నెక్ట్స్ ఓటీటీ

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన మూవీ అలవైకుంఠపురంలో. సంక్రాంతికి వచ్చి మెగా హిట్ కొట్టిన సినిమా ఇది. ఐఎండీబీలో 7.3 రేటింగ్ నమోదైంది. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

జులాయి - జియోహాట్‌స్టార్

ఇది కూడా బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే. 7.3 రేటింగ్ సాధించింది. ఇలియానా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

రేసు గుర్రం - సోనీ లివ్ ఓటీటీ

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మూవీ రేసు గుర్రం. ఈ సినిమాకు కూడా ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉంది. అల్లు అర్జున్, శృతి హాసన్ నటించిన ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం