మీ పిల్లలకు సమ్మర్ హాలీడేసా? అయితే, ఓటీటీలోని ఈ 6 మోటివేషనల్ సినిమాలు చూపించేసేయండి- తెలుగులో 3- కానీ, అన్నీ స్పెషలే!-best 6 ott movies that gives motivation to children during summer holidays on netflix amazon prime aha disney hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మీ పిల్లలకు సమ్మర్ హాలీడేసా? అయితే, ఓటీటీలోని ఈ 6 మోటివేషనల్ సినిమాలు చూపించేసేయండి- తెలుగులో 3- కానీ, అన్నీ స్పెషలే!

మీ పిల్లలకు సమ్మర్ హాలీడేసా? అయితే, ఓటీటీలోని ఈ 6 మోటివేషనల్ సినిమాలు చూపించేసేయండి- తెలుగులో 3- కానీ, అన్నీ స్పెషలే!

Sanjiv Kumar HT Telugu

స్కూల్ పిల్లల్లో స్పూర్థినింపేందుకు బెస్ట్ ఆప్షన్ సినిమాలు. పిల్లల్లో మోటివేషన్ పెరగడానికి ఉపయోగపడే ఆరు ఓటీటీ సినిమాలను చెబుతున్నాం. అయితే, వాటిలో కేవలం మూడు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ, చూసేందుకు అన్నీ స్పెషల్ సినిమాలే. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

మీ పిల్లలకు సమ్మర్ హాలీడేసా? అయితే, ఓటీటీలోని ఈ 6 మోటివేషనల్ సినిమాలు చూపించేసేయండి- తెలుగులో 3- కానీ, అన్నీ స్పెషలే!

సమ్మర్ హాలీడేస్ వచ్చేశాయి. ఇక పిల్లలు ఆటలు అంటూ తిరగడమే కాకుండా తల్లిదండ్రులను తెగ విసిగించేస్తారు. అయితే, చిచ్చర పిడుగులు అయిన పిల్లల్లో స్ఫూర్తి నింపేలా, ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు బెస్ట్ ఆప్షన్ సినిమాలు. మరి పిల్లలకు స్ఫూర్తినిచ్చే ఆరు ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

17 ఏళ్ల బాలుడి కథ

2010లో హిందీ భాషలో వచ్చిన మెల్ల డ్రామా చిత్రం ఉడాన్. విక్రమాదిత్య మోత్వానే కథ, దర్శకత్వం అందించిన ఈ సినిమా 17 ఏళ్ల రోహన్ అనే బాలుడు చుట్టూ తిరుగుతుంది. రోహన్‌ అర్ధరాత్రి ఫ్రెండ్స్‌తో చేసిన ఓ పనికి హాస్టల్ నుంచి ఇంటికి పంపించేస్తారు.

17 ఏళ్ల వయసులో అబ్బాయిల్లో వచ్చే మార్పులు, తమ్ముడు, తల్లిదండ్రులతో మెలిగే తీరుతో ఉడాన్ తెరకెక్కించారు. ఐఎమ్‌డీబీ నుంచి 10కి 8.1 రేటింగ్ సాధించిన ఉడాన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అయ్యే ఉడాన్ పిల్లలకు మోటివేషన్‌గా, తల్లిదండ్రులకు పేరెటింగ్‌గా ఉపయోగపడుతుంది.

ధైర్యంగా ఎలా ఉండాలి

ఇంట్లో ఒంటరిగా ఉన్న పిల్లోడిపై దొంగలు అటాక్ చేస్తే వారి నుంచి ఆ బాలుడు ఎలా తప్పించుకున్నాడు అనేదే ఇంగ్లీష్ కామెడీ మూవీ హోమ్ ఎలోన్. ఇంట్లో పిల్లాడిని ఒక్కడినే వదిలేసి తల్లిదండ్రులు వెళ్లిపోతారు. అప్పుడు దొంగతనం చేయడానికి వచ్చిన ముగ్గురితో ఆ పిల్లాడు ఎలా ఆడుకున్నాడో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

1990లో వచ్చిన ఈ సినిమాను ఆధారంగా చేసుకునే 1995లో తెలుగులో సిసింద్రి తెరకెక్కించారు. ఎవరు తోడు లేనప్పుడు పిల్లలు ఎలా ధైర్యంగా చెప్పే సినిమా ఇది. ఐఎమ్‌డీబీ నుంచి 7.7 రేటింగ్ సొంతం చేసుకున్న హోమ్ ఎలోన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అబ్దుల్ కలామ్ అవ్వాలనుకునే పిల్లాడి కథ

2011లో ఇండియాలో విడుదలైన హిందీ కామెడీ డ్రామా చిత్రం ఐయామ్ కలామ్. పేదరికంలో పుట్టి పెరిగిన చోటు అనే పిల్లాడు హైవే పక్కన ఉన్న దాబాలో లేబర్‌గా తన కుటుంబం కోసం పనిచేస్తుంటాడు. కానీ, చోటుకు ఏపీజే అబ్దుల్ కలామ్ అవ్వాలని కలలు అంటాడు. మరి అలాంటి చోటు ఏమయ్యాడు అనేదే ఈ సినిమా కథ.

పిల్లల్లో మంచి స్ఫూర్తినింపే చిత్రంగా ఐయామ్ కలామ్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఐయామ్ కలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు భాషలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.

మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మ విశ్వాసం

పిల్లల్లో ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒకటి. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ నేర్చుకునే ఓ పిల్లాడి కథాంశంతో వచ్చిన సినిమానే ది కరాటే కిడ్. 2010లో వచ్చిన ఈ సినిమా పిల్లలకు బాగా మోటివేషన్ ఇస్తుంది.

ది కరాటే కిడ్ మూవీని అమెజాన్ ప్రైమ్, జీ5, ఎమ్ఎక్స్ ప్లేయర్ వంటి మూడు ఓటీటీల్లో వీక్షించవచ్చు. జీ5లో రెంటల్ విధానంలో, ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో హిందీలో ది కరాటే కిడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

మ్యాథ్స్ అంటే భయమా?

మ్యాథ్స్ అంటే దాదాపు ప్రతి పిల్లాడికి భయమే. అలాంటి మ్యాథ్స్‌నే కాదు జీవితంలో ఏదైనా ఎదుర్కోవాలి అని చెప్పే సినిమానే 35 చిన్న కథ కాదు. 7.9 రేటింగ్ సాధించుకున్న ఈ తెలుగు కామెడీ డ్రామా చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

గాంధీజీ భావాలకు అనుగుణంగా

మహాత్మ గాంధీజీ భావాలకు, సూత్రాలను పాటించాలనే ఉద్దేశంతో తెరకెక్కిన సినిమా గాంధీ తాత చెట్టు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి నటించిన ఈ సినిమా 13 ఏళ్ల బాలిక చుట్టూ తిరుగుతుంది. పిల్లల్లో గాంధీజీ భావజాలాన్ని నింపే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం