ఓటీటీలో ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు మీకు నచ్చిందా? అలాంటి ది బెస్ట్ 5 పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!-best 5 ott political crime thrillers like the hunt rajiv gandhi assassin case like freedom at night parmanu rocket boys ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు మీకు నచ్చిందా? అలాంటి ది బెస్ట్ 5 పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!

ఓటీటీలో ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు మీకు నచ్చిందా? అలాంటి ది బెస్ట్ 5 పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ట్రూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు. సోనీ లివ్‌‌లో ఓటీటీ రిలీజ్ అయిన ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు సిరీస్ మీకు నచ్చినట్లయితే అలాంటి ఈ ది బెస్ట్ 5 ఓటీటీ పొలిటికల్ క్రైమ్, హిస్టారికల్ థ్రిల్లర్స్‌‌పై లుక్కేయండి.

ఓటీటీలో ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు మీకు నచ్చిందా? అలాంటి ది బెస్ట్ 5 పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్ (రాజీవ్ గాంధీ హత్య కేసు) అనేది ఒక నిజమైన పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. సోనీ లివ్‌లో తెలుగులో ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సిరీస్ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత 90 రోజుల పాటు జరిగిన గాలింపు చర్యల కథాంశంగా సాగుతుంది. 1991 ఆత్మాహుతి దాడికి బాధ్యులైన వారిని గుర్తించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేసిన ప్రయత్నాలను చూపిస్తుంది. మరి ఇలాంటి నిజ సంఘటనలతో తెరకెక్కిన ది బెస్ట్ 5 ఓటీటీ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ లుక్కేయండి.

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ ఓటీటీ

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, భారత్-పాక్ విభజన, అందులో రాజకీయ నేపథ్యం, మతపరమైన ఉద్రిక్తతలు, మానవ విలువలతో సాగుతుంది. ఈ సిరీస్‌ను సోనీ లివ్‌లో వీక్షించవచ్చు.

జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మహమ్మద్ అలీ జిన్నా వరకు అనేక కీలక వ్యక్తులు, లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్, లేడీ ఎడ్వినా మౌంట్‌బాటెన్‌లను ఈ సిరీస్‌లో చూపించారు.

మిషన్ ఓవర్ మార్స్ ఓటీటీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM) అయిన మంగళ్‌యాన్‌పై తెరకెక్కిన సిరీస్ మిషన్ ఓవర్ మార్స్. ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన నలుగురు మహిళా శాస్త్రవేత్తల కథ ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇది జీ5 ఓటీటీలో రిలీజ్ అయింది.

రాకెట్ బాయ్స్ ఓటీటీ

ఇద్దరు గొప్ప భారతీయ శాస్త్రవేత్తలు, డాక్టర్ హోమీ జె. భాభా, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ రాకెట్ బాయ్స్. ఇది భారతదేశం ఏర్పడిన తొలినాళ్లలో (1940-1960 మధ్య) భారతదేశ శాస్త్రీయ అభివృద్ధికి ఈ ఇద్దరు శాస్త్రవేత్తల సహకారంపై సిరీస్ సాగుతుంది.

స్వాతంత్య్రం అనంతర భారతదేశ నేపథ్యంలో భారతదేశ అణు, అంతరిక్ష కార్యక్రమాలను నిర్మించాలనే వారి ఆశయాలను ఈ సిరీస్‌లో చూపించారు. రాకెట్ బాయ్స్ సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

పర్మాణు: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్ ఓటీటీ

పర్మాణు: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్ 1998లో పోఖ్రాన్ వద్ద భారతదేశం నిర్వహించిన అణు పరీక్షల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన ఐఏఎస్ అధికారి అశ్వత్ రైనాగా జాన్ అబ్రహం, కెప్టెన్ అంబాలికగా డయానా పెంటి నటించారు.

అమెరికా నుండి వ్యతిరేకత, ఇతర అడ్డంకులు ఉన్నప్పటికీ రహస్యంగా ప్రయోగాలు నిర్వహించి అమలు చేయడానికి రైనా చేసిన ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ ఓటీటీ

ఆరు ఎపిసోడ్స్‌తో 1919 నాటి జలియన్‌వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో రూపొందించబడిన వెబ్ సిరీస్ ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్. ఈ కథ లండన్ నుంచి తిరిగి వచ్చిన న్యాయవాది కాంతిలాల్ సాహ్ని చుట్టూ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో ఓటీటీ రిలీజ్ అయింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం