ఓటీటీలో ఆహా అనిపించే 5 బోల్డ్ సినిమాలు.. శృంగార సీన్లు మాత్రమే కాదు ఒక్కో మూవీకి ఒక్కో మెసేజ్.. అస్సలు మిస్ కావొద్దు!-best 5 ott bold movies with a good message girls will be girls vivekanandan viral chhatriwali ott release on prime zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో ఆహా అనిపించే 5 బోల్డ్ సినిమాలు.. శృంగార సీన్లు మాత్రమే కాదు ఒక్కో మూవీకి ఒక్కో మెసేజ్.. అస్సలు మిస్ కావొద్దు!

ఓటీటీలో ఆహా అనిపించే 5 బోల్డ్ సినిమాలు.. శృంగార సీన్లు మాత్రమే కాదు ఒక్కో మూవీకి ఒక్కో మెసేజ్.. అస్సలు మిస్ కావొద్దు!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో ఎన్నో రకాల బోల్డ్ సినిమాలు ఉన్నాయి. అయితే, కేవలం బోల్డ్, శృంగారం సీన్లు మాత్రమే కాకుండా ఒక్కో సినిమాకు ఒక్కో మెసేజ్ ఉంది. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో మంచి మెసేజ్ అందించే 6 ఓటీటీ బోల్డ్ సినిమాలు, వాటి ప్లాట్‌ఫామ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో 3 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీలో ఆహా అనిపించే 5 బోల్డ్ సినిమాలు.. శృంగార సీన్లు మాత్రమే కాదు ఒక్కో మూవీకి ఒక్కో మెసేజ్.. అస్సలు మిస్ కావొద్దు!

ఓటీటీలో ఎన్నో విభిన్న రకాల కంటెంట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో బోల్డ్ సినిమాలు సైతం ఉన్నాయి. అయితే, కేవలం శృంగారం, బోల్డ్, రొమాంటిక్ సీన్లు మాత్రమే కాకుండా మంచి మెసేజ్‌తో ఆహా అనిపించే ఐదు ఓటీటీ బోల్డ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కౌమార దశలో ఉన్న కూతురు

ఓటీటీలోకి నేరుగా రిలీజ్ అయిన బోల్డ్ అండ్ రొమాంటిక్ చిత్రం గర్ల్స్ విల్ బీ గర్ల్స్. ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025కి గాను ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకున్న గర్ల్స్ విల్ బీ గర్ల్స్ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, హిందీ, ఇంగ్లీష్ తదితర భాషల్లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ఓటీటీ రిలీజ్ అయింది.

మలయాళ పాపులర్ నటి కని కుశ్రుతి, ప్రీతి పాణిగ్రహి నటించిన ఈ సినిమాలో 16 ఏళ్ల కూతురికి కౌమార దశలో వచ్చి సెక్సువల్ ఫీలింగ్స్‌ ఆమె చదువులకు ఆటంకం కలగకూడదని పరితపించే తల్లి చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

రియలిస్టిక్‌గా, బోల్డ్ సీన్స్‌తో ఉన్న గర్ల్స్ విల్ బీ గర్ల్స్‌కు ఐఎమ్‌డీబీ 7.1 రేటింగ్ ఇచ్చింది. ఒక తల్లి తన కూతురుని ఎలా అర్థం చేసుకోవాలి, కౌమార దశలో ఎలా చూసుకోవాలో ఈ గర్ల్స్ విల్ బీ గర్ల్స్ సినిమా చెబుతుంది.

శృంగార పిచ్చి ఉన్న భర్త

శృంగారం పిచ్చితో భాగస్వాములకు గాయాలు చేసే భర్త చుట్టూ సాగే సినిమానే వివేకానందన్ వైరల్. బోల్డ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన మలయాళ మూవీవివేకానందన్ వైరల్‌లో దసరా విలన్ షైన్ టామ్ చాకో, స్వాసిక, గ్రేస్ ఆంటోనీ, మరీనా మైఖేల్ కురిసింగల్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు.

శృంగారం చేసే సమయంలో భార్యకు, ఎఫైర్ పెట్టుకున్న యువతి శరీరాలకు గాయాలు చేయడంతోనే తృప్తి చెందే మగాడికి మహిళలు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చారో చూపించే సినిమానే ఇది. ఆడవాళ్ల ఫీలింగ్స్, సౌకర్యం పట్టించుకోకుండా సెక్స్ కోరుకునే మగాళ్లను ఎలా డీల్ చేయాలో చెప్పే ఈ వివేకానందన్ వైరల్ ఆహాలో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అక్రమ సంబంధాలు మీద

ఈటీవీ ప్రభాకర్ నటించిన తెలుగు రొమాంటిక్ మూవీ రాజు గారి కోడి పులావ్. థియేటర్లలో రిలీజ్ తర్వాత ఈ సినిమాను ఎల్ఎస్‌డీ (లవ్ సెక్స్ డెత్) అనే టైటిల్‌తో ఓటీటీలోకి వెబ్ సిరీస్‌లాగా తీసుకొచ్చారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారిని ఓ అమ్మాయి చంపుతూ ఉంటుంది. అది ఎలా చంపిందనేదే ఎల్ఎస్‌డీ స్టోరీ.

సెక్సువల్ అఫైర్స్ బంధాలను విచ్ఛిన్నం చేస్తాయని మెసేజ్ ఇచ్చే లవ్ సెక్స్ డెత్ తెలుగు సిరీస్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఈ వెబ్ సిరీస్‌ను ఫ్రీగా చూసేయొచ్చు.

సేఫ్ సెక్స్ గురించి

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్‌గా నటించిన బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం ఛత్రివాలి. సేఫ్ సెక్స్, కండోమ్‌కు ఉన్న ఇంపార్టెన్స్, సెక్సువల్ హెల్త్ వంటి శృంగారపరమైన అవగాహనను కల్పించే ఉద్దేశంతో ఛత్రివాలి మూవీని తెరకెక్కించారు.

క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్న ఛత్రివాలి మూవీ జీ5లో ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, కేవలం హిందీ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఛత్రివాలి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సైజ్ అనేది మ్యాటరా?

మగాళ్లలో సైజ్ పెద్దగా ఉండటం అనేది చాలా ముఖ్యం అనే అపోహ నుంచి బయటపడేసేందుకు కామెడీ తరహాలో చూపించిన సినిమానే ఏక్ మినీ కథ. సైజ్ గురించి పురుషుల్లో పడే ఇన్‌సెక్యూర్ ఫీలింగ్, పెద్దగా ఉంటేనే శృంగారం జీవితం సాఫీగా సాగుతుందని పురుషుల్లో ఉండే భయాన్ని ఏక్ మినీ కథ మూవీలో హీరో సంతోష్ శోభన్ ద్వారా బాగా చూపించారు.

భాగస్వామ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమ ఉంటే చాలు, సైజ్‌లు అనేవి పెద్ద మ్యాటర్ అనేది కాదు అనే సందేశం ఇచ్చే ఏక్ మినీ కథ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం