OTT 31st: ఓటీటీలో బెస్ట్ 3 తెలుగు సినిమాలు- డిఫరెంట్ జోనర్స్, కామన్‌గా ఫ్యామిలీ ఎమోషన్- ఈ 31కి చూస్తూ ఎంజాయ్ చేయండి!
OTT Movies Telugu To Watch This 31st December: ఓటీటీలో ఉన్న ఎన్నో సినిమాల్లో ఈ డిసెంబర్ 31కి బెస్ట్ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ తెలుగు చిత్రాలు మంచి ఆప్షన్. డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన ఈ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్ మాత్రం కామన్‌గా ఉంది. ఇవన్నీ ఒక్క ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Best OTT Telugu Movies To Watch On 31st December: 2024కి గుడ్ బై చెప్పేసి న్యూ ఇయర్ 2025కి వెల్‌కమ్ చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక కొత్త సంవత్సరం అంటే అందరికి గుర్తుకు వచ్చేది 31. డిసెంబర్ 31ని బాగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏవేవే ప్లాన్స్ వేస్తుంటారు. మరి మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాలతో డిసెంబర్ 31ను జరుపుకోవాలనుకుంటే ఈ మూడు తెలుగు చిత్రాలు బెస్ట్ ఆప్షన్.
పొట్టేల్ ఓటీటీ
మల్లేశం, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో అలరించిన హీరోయిన్ అనన్య నాగళ్ నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ పొట్టేల్. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్, ఆచారాలు, గ్రామంలోని కట్టుబాట్లు వంటి అంశాలతో తెరకెక్కింది పొట్టేల్ సినిమా. డిసెంబర్ 20 నుంచి ఆహా, అమెజాన్ ప్రైమ్ రెండు ఓటీటీల్లో పొట్టేల్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
లవ్ స్టోరీ, కూతురు చదువు, ఊరి పెద్ద, దేవుడు వచ్చుడు వంటి అచ్చమైన పల్లెటూరి కాన్సెప్ట్‌తో వచ్చిందే పొట్టేల్ మూవీ. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగానే ఉంటాయి. అయితే, అనన్య నాగళ్ల కిస్ సీన్ ఒక్కటి తప్పా మిగతా సినిమాను ఫ్యామిలీతో ఎంచక్కా చూసేయొచ్చు.
కేసీఆర్ ఓటీటీ
జబర్దస్త్ రాకేష్ హీరోగా, నిర్మాతగా మారిన సినిమా కేసీఆర్. అంటే, కేశవ చంద్ర రమావత్. పొలిటికల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో నటి ప్రముఖ నటి సత్య కృష్ణన్ కుమార్తె అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలనుకుని కలలు కనే ఓ లంబాడి యువకుడు హైదరాబాద్‌లో ఎలాంటి పాట్లు పడ్డాడో చూపించే సినిమా ఇది.
తెలంగాణ గ్రామాల్లో వాడుక భాష, ప్రేమలు, ఆప్యాయతలు, కుటుంబ అనుబంధాలు, బావ మరదళ్ల ప్రేమ వంటి ఎమోషన్స్‌తో సాగే కేశవ చంద్ర రమావత్ మూవీ ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 28 నుంచి కేసీఆర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా.. ఇందులో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ బాగానే చూపించారు.
జనక అయితే గనక
వరుస సినిమాలతో దూసుకుపోయే యంగ్ హీరో సుహాస్ నటించిన మరో ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామానే జనక అయితే గనక. కుటుంబ పోషణ బారంగా ఉన్న మధ్యతరగతి యువకుడు పిల్లల పెంపకం మరింత కష్టంగా భావిస్తాడు. ఇక పిల్లల దుస్తుల నుంచి స్కూల్ ఫీజుల వరకు ఉండే ఖర్చు చూసి సగటు మిడిల్ క్లాస్ మ్యాన్‌లా భయపడిపోతాడు.
అందుకే పిల్లలను కనడం వద్దనుకున్న ఆ కొత్త పెళ్లికొడుకుకు కండోమ్ షాక్ ఇస్తుంది. దాంతో కండోమ్ కంపెనీపై కోర్టులో కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. కామెడీ, ఎమోషనల్ సీన్స్, భార్యాభర్తల మధ్య అనుబంధం వంటి అంశాలను మేళవించి ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబం ఆలోచించేలా తెరకెక్కిన సినిమానే జనక అయితే గనక.
ఒక్క ఓటీటీలోనే స్ట్రీమింగ్
సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన జనక అయితే గనక మూవీ కూడా ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఈ మూడు తెలుగు సినిమాలు ఒక్క ఆహా ఓటీటీలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో ఈ డిసెంబర్ 31ని ఫ్యామిలీతో చూస్తూ (ఇదివరకు చూడకపోతే) ఎంజాయ్ చేసేయండి.