దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. 2005లో రిలీజైన ఈ తెలుగు యాక్షన్ మూవీ ఓ ఐకానిక్‍గా నిలిచింది. ప్రభాస్ కెరీర్‌కు సూపర్ బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా హిందీలో ఛత్రపతి పేరుతోనే రీమేక్ అయింది. తెలుగు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్.. ఛత్రపతి హిందీ రీమేక్‍తో బాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. 2023లో విడుదలైన ఆ మూవీ అల్ట్రా డిజాస్టర్ అయింది.
ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్లలో శ్రీనివాస్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఛత్రపతి హిందీ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదో వివరించారు.
ఛత్రపతి హిందీ జనాలకు తెలియదని అనుకున్నామని, కానీ కరోనా టైమ్‍లో చాలా మంది చూసేశారని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. దీనివల్లే ప్లాఫ్ అయిందనేలా కారణం చెప్పారు. “తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నామని అనుకున్నాం. అక్కడ ఎవరికీ ఆ సినిమా తెలియదని అనుకున్నా. కానీ అప్పుడే కొవిడ్ వచ్చింది. ఆ సమయంలో అందరూ ఆ సినిమా చూసేశారు” అని శ్రీనివాస్ అన్నారు.
హిందీలో మదర్ సెంటిమెంట్, సవతి సోదరుల ఎమోషన్ ఎప్పుడైనా వర్కౌట్ అవుతుందని అప్పడు నిర్మాత తనతో చెప్పారని శ్రీనివాస్ అన్నారు. ఛత్రపతి హిందీ రీమేక్‍కు అంగీకరించేందుకు అదో కారణం అని అన్నారు. రాజమౌళి సినిమా.. ఎమోషన్లు వర్కౌట్ అవుతాయని ఆ ప్రాజెక్ట్ చేశామన్నారు. డైరెక్టర్ వీవీ వినాయక్ ఉన్నారన్న ధైర్యం కూడా ఉండిందని అన్నారు.
ఛత్రపతి సినిమాను రీమేక్ చేయకుండా ఉండాల్సిందని తర్వాత అనిపించిందని శ్రీనివాస్ అన్నారు. షూటింగ్ సమయంలోనే డైలమా వచ్చిందని అన్నారు. తాను ఆ మూవీ కోసం 100 శాతం కష్టపడ్డానని, అనుకున్న ఫలితం రాలేదని చెప్పార.
ఛత్రపతి హిందీ రీమేక్ మూవీకి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన నుష్రత్ బరుచా హీరోయిన్‍గా నటించారు. ఈ మూవీని జయంతిలాల్ గద, ధావల్, అక్షయ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ సినిమా సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. కనీసం రూ.3కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా చేరలేకపోయింది. అల్ట్రా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి రవి బస్రూర్, తనిష్క్ బాగ్చీ సంగీతం అందించారు.
భైరవం సినిమా ఈనెల మే 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్‍తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నుంచి రీసెంట్‍గా వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది.
తమిళ మూవీ గరుడన్ స్టోరీ ఆధారంగా భైరవం సినిమా తెరకెక్కింది. అయితే, చాలా మార్పులను చేసినట్టు శ్రీనివాస్ చెప్పారు. కథలోని సోల్‍ను మాత్రమే కాస్త తీసుకున్నామని, చాలా ఎలిమెంట్లను యాడ్ చేశామని చెప్పారు. ఇది రీమేక్ అంటే ఒప్పుకోనని కూడా అన్నారు. భైరవం చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం