Bellamkonda Sreenivas: 400 ఏళ్ల నాటి దశావతార ఆలయంపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ.. అడ్వెంచర్ పోస్టర్ అదుర్స్-bellamkonda sai sreenivas new movie bss12 motion poster released with 400 years ago temple story on his birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bellamkonda Sreenivas: 400 ఏళ్ల నాటి దశావతార ఆలయంపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ.. అడ్వెంచర్ పోస్టర్ అదుర్స్

Bellamkonda Sreenivas: 400 ఏళ్ల నాటి దశావతార ఆలయంపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ.. అడ్వెంచర్ పోస్టర్ అదుర్స్

Sanjiv Kumar HT Telugu
Jan 04, 2025 02:58 PM IST

Bellamkonda Sai Sreenivas BSS12 Poster Released: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న న్యూ మూవీ బీఎస్ఎస్12 ఇటీవల ప్రారంభం అయింది. 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో సాగే ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ అట్రాక్ట్ చేస్తోంది.

400 ఏళ్ల నాటి దశావతార ఆలయంపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ.. అడ్వెంచర్ పోస్టర్ అదుర్స్
400 ఏళ్ల నాటి దశావతార ఆలయంపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ.. అడ్వెంచర్ పోస్టర్ అదుర్స్

Bellamkonda Sai Sreenivas BSS12 Poster Released: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 2014లో అల్లుడు శీను మూవీతో హీరోగా అరంగేట్రం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆ రేంజ్‌లో విజయం సాధించలేదు.

yearly horoscope entry point

హిందీలో రీమేక్ చేసినప్పటికీ

చాలా గ్యాప్ తర్వాత 2019లో తమిళ రీమేక్‌గా వచ్చిన రాక్షసుడు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అనంతరం మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కానీ, వాటికి యూట్యూబ్‌లో హిందీ వెర్షన్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్ ఉండటం విశేషం. ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసిన కూడా విజయం వరించలేదు.

35 శాతం షూటింగ్ పూర్తి

దాంతో ఎలాగైన హిట్ కొట్టెందుకు ప్రయత్నిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్‌లో 12 వ చిత్రం చేస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త ప్రాజెక్ట్ BSS12 ఇప్పటికే 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. డెబ్యుటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్‌ మూవీ.

అడ్వంచర్ అవతార్‌లో

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఇటీవల అతని క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను అడ్వంచర్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు. రెండు కాళ్లను సీటుపై పెట్టుకుని బైక్‌ను నడుపుతూ ధైర్యంగా దూసుకెలుతున్న లుక్ అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ మూమెంట్ ఇంటెన్సిటీ పెంచింది.

విష్ణువు నామాలు కనిపించడం

ఒక విశాలమైన లోయ, అతని వెనుక ఒక కొండపై విష్ణువు నామాలు కనిపించడం అద్భుతంగా ఉంది. ఈ పవర్‌ఫుల్ విజువల్ వండర్ అండ్ అడ్వంచర్, డివైన్ ఎనర్జీని ప్రజెంట్ చేస్తోంది. బెల్లంకొండ అడ్వంచర్ స్టంట్స్ ఇంటెన్స్ యాక్షన్‌లతో కూడిన పాత్రను పోషిస్తున్నందున ప్రేక్షకులు మరపురాని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ని ఆశించవచ్చని మేకర్స్ ఆశిస్తున్నారు.

400 ఏళ్ల నాటి ఆలయం

ఈ సినిమా 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఉంటుందట. ఇక ఈ సినిమాలో సాయి శ్రీనివాస్‌కు జోడీగా సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా శివేంద్ర, సంగీతం లియోన్ జేమ్స్, ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస్ ఆర్, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీనాగేంద్ర తంగాల పని చేస్తున్నారు.

Whats_app_banner