టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా భైరవం. మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. మే 30న గ్రాండ్ రిలీజ్ కానున్న భైరవం ట్రైలర్‌ను తాజాగా మే 18న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. అందరూ భైరవం ట్రైలర్ ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్‌లానే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందరూ సినిమాని సపోర్ట్ చేసి ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.
"చాలా ప్రేమించి ఇష్టపడి, కష్టపడి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చేశాం. మే 30న భైరవం మీ అందరి ముందుకు వచ్చి మీ అందరిని అలరిస్తుంది. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులకు టెక్నీషియన్స్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపాడు.
"మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, ఏలూరు ఎంపీ మహేష్ గారికి ధన్యవాదాలు. ఆయన ప్రోత్సహంతోనే ఈ వేడుక ఏలూరులో జరుగుతోంది. ఆయన వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను రాధా మోహన్ గారు ఒక మంచి సినిమా చేద్దామని మొదట్నుంచి అనుకున్నాం. చాలా మంచి కథ దొరికింది. ఇంత మంచి సినిమా తీసిన నిర్మాత రాధ మోహన్ గారికి, శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు" అని సాయి శ్రీనివాస్ పేర్కొన్నాడు.
"విజయ్ గారు మేకింగ్ ఎమోషన్స్‌తో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే భైరవం. శ్రీ చరణ్ మ్యూజిక్ మ్యూజికల్ ఫీస్ట్‌లా ఉంటుంది. ఈ సినిమాకు పని చేసిన దివ్య, ఆనంది, అతిధి శంకర్‌కి థాంక్యూ. ఈ సినిమాకి కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ విజయం నారా రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడంతో జరిగింది. ఆయన సినిమాని ఒప్పుకోవడం మోస్ట్ హ్యాపీ మూమెంట్. రోహిత్ అన్న వెరీ నైస్ పర్సన్" అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.
"మంచు మనోజ్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్‌ని. అన్ని సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న యాక్టర్ మా సినిమాలో చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. గజపతి వర్మ క్యారెక్టర్‌లో ఆయన (మంచు మనోజ్) తప్పితే మరొకరిని ఊహించలేం. ఈ వేడుకకొచ్చి ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే 30న అందరూ థియేటర్స్‌లో కలుద్దాం. లవ్ యూ ఆల్" అని బెల్లంకొండ శ్రీనివాస్ తన స్పీచ్ ముగించాడు.