Nenu Student sir Trailer: నేను స్టూడెంట్ సార్ ట్రైలర్ విడుదల.. మరోసారి కంటెంట్ బేస్ చిత్రంతో రానున్న చిన్న బెల్-bellamkonda ganesh nenu student sir trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bellamkonda Ganesh Nenu Student Sir Trailer Released

Nenu Student sir Trailer: నేను స్టూడెంట్ సార్ ట్రైలర్ విడుదల.. మరోసారి కంటెంట్ బేస్ చిత్రంతో రానున్న చిన్న బెల్

Maragani Govardhan HT Telugu
May 21, 2023 08:18 PM IST

Nenu Student sir Trailer: బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం నేను స్టూడెంట్ సార్. అవంతిక దస్సానీ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది.

నేను స్టూడెంట్ సార్ ట్రైలర్ విడుదల
నేను స్టూడెంట్ సార్ ట్రైలర్ విడుదల

Nenu Student sir Trailer: బెల్లంకొండ గణేష్.. స్వాతిముత్యం సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసిన ఈ హీరో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అన్న బెల్లంకొండ శ్రీనివాస్ మాదిరిగా యాక్షన్ సినిమాల జోలికి పోకుండా.. కంటెంట్ బేస్డ్ చిత్రాలకే ఓటేస్తున్నాడు. స్వాతిముత్యం మూవీ కంటెంట్ పరంగా ఎంత వైవిధ్యంగా ఉంటుందో.. అందులో అతడి నటన కూడా అంతే బాగుంటుంది. ప్రస్తుతం అతడు నటించిన రెండో చిత్రం నేను స్టూడెంట్ సార్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే సినిమా ఆసక్తికరంగా ఉంటుందని అంచనాకు రావచ్చు. గణేష్ కష్టపడి ఓ ఐఫోన్ కొనుక్కుంటాడు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో నడుమ అతడు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అంతేకాకుండా అతడి అకౌంట్‌లో రూ.1.75 లక్షలు డిపాజిట్ అవుతాయి. దీంతో అతడి పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. తను చదువుకుంటున్న కాలేజీలో విద్యార్థులు మినహా ఎవరూ అతడికి అండగా నిలపడరు. మరి ఆ సమస్యల నుంచి గణేష్ బయటపడ్డాడో లేదో తెలియాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.

యూనిక్ స్టోరీలైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుందని ట్రైలర్‌ను చూస్తేనే తెలుస్తోంది. గ్రిప్పింగ్ నెరేటివ్ స్టైల్‌తో సినిమాపై ఆత్రుతను పెంచింది ఈ ప్రచార చిత్రం. గణేష్ ఇందులో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపిస్తాడు. అతడి సరసన ఈ చిత్రంలో అవంతిక దస్సాని హీరోయిన్‌గా చేసింది. పోలీసు అధికారి పాత్రలో సముద్రఖని ప్రెజెంన్స్ మూవీపై మరింత ఆసక్తిని కలగజేస్తోంది.

నేను స్టూడెంట్ సార్ సినిమాకు రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు. నాంది లాంటి సూపర్ హిట్ రూపొందించిన నిర్మాత సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు మహతీ స్వర సాగర్ సంగీతాన్ని సమకూర్చగా.. కృష్ణ చైతన్య కథను అందించారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనిత్ మధాడి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ మూవీ జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.