Hero Nikhil: హీరో నిఖిల్ నటించిన తెలుగు టీవీ సీరియల్ ఇదే - అప్పుడుఈ టాలీవుడ్ హీరో లుక్ ఎలా ఉందంటే?
Hero Nikhil: కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు నిఖిల్. ప్రస్తుతం స్వయంభూతో పాటు రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేస్తోన్న ది ఇండియా హౌజ్ సినిమాల్లో నటిస్తోన్నాడు. సినిమాల్లోకి రాకముందు నిఖిల్ టీవీ సీరియల్ చేశాడు. చందరంగం పేరుతో తెరకెక్కిన ఈ సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ అయ్యింది.
Hero Nikhil: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా సక్సెస్ కావడం అంటే ఆషామాషీ కాదు. ఈ జర్నీ వెనుక ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. వారసత్వం లేకుండా స్వయంకృషితో హీరోలుగా మారిన టాలీవుడ్ హీరోల్లో నిఖిల్ ఒకరు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీడేస్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నిఖిల్ కార్తికేయ 2తో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లను అందుకుంటోన్నాడు.
హైదరాబాద్ నవాబ్స్, సంబరం...
హ్యాపీడేస్ కంటే ముందు నిఖిల్ అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. స్క్రీన్‌పై కనిపిస్తే చాలనే ఆలోచనతో సంబరం, హైదరాబాద్ నవాబ్స్‌తో పాటు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. సినిమాలే కాకుండా ఓ టీవీ సీరియల్‌లో నిఖిల్ నటించాడు. ఈటీవీలో టెలికాస్ట్ అయిన చదరంగం సీరియల్‌లో కీలక పాత్ర పోషించాడు.
యంగ్ లుక్…
1998 టైమ్‌లో టెలికాస్ట్ అయిన చందరంగం సీరియల్‌లో నిఖిల్‌తో పాటు చిన్నా, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. ఈ సీరియల్‌లో కంప్లీట్ యంగ్ లుక్‌లో నిఖిల్ కనిపిస్తాడు. అప్పట్లో ఈ సీరియల్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. బుల్లితెర ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. నిఖిల్ నటించిన ఏకైక సీరియల్ ఇదే కావడం గమనార్హం.
వంద కోట్ల కలెక్షన్స్...
కార్తికేయ మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు నిఖిల్. చందూ మొండేటి దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్‌గా కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 120 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు డబ్బింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో డిజాస్టర్...
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించాడు నిఖిల్. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది.
రామ్ చరణ్ ప్రొడ్యూసర్...
ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ తో పాటు ది ఇండియా హౌజ్ సినిమాలు చేస్తోన్నాడు. హిస్టారియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న స్వయంభూ మూవీతో భరత్ కృష్ణమాచారి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభానటేష హీరోయిన్లుగా నటిస్తోన్నారు.
ది ఇండియా హౌజ్ మూవీని మెగా హీరో రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. స్వాతంత్య్ర సంగ్రామం నాటి సంఘటనలతో పీరియాడికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.