Sneha: భర్త కంటే ముందుగా నిర్మాతతో స్నేహకు సంబంధం.. సంచలనంగా కామెంట్స్-bayilvan ranganathan sensational comments on sneha relation with producer before prasanna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sneha: భర్త కంటే ముందుగా నిర్మాతతో స్నేహకు సంబంధం.. సంచలనంగా కామెంట్స్

Sneha: భర్త కంటే ముందుగా నిర్మాతతో స్నేహకు సంబంధం.. సంచలనంగా కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 27, 2023 09:22 AM IST

Sneha Producer Relation: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, రిలేషన్‍షిప్స్ సర్వసాధారణమే. అయితే సంక్రాతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్నేహ తన భర్త కంటే ముందుగానే లవ్ ఎఫైర్ నడిపిందని కోలీవుడ్ జర్నలిస్ట్ బయిల్వాన్ రంగనాథన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

భర్త కంటే ముందుగా నిర్మాతతో స్నేహకు సంబంధం.. సంచలనంగా కామెంట్స్
భర్త కంటే ముందుగా నిర్మాతతో స్నేహకు సంబంధం.. సంచలనంగా కామెంట్స్

తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ షో చేయకుండా ఎంతో పద్ధతిగా కనువిందు చేసిన హీరోయినల్లో సీనియర్ నటి స్నేహ ఒకరు. తొలివలపు సినిమాతో తెలుగులో పరిచమయైన స్నేహ అసలు పేరు సుహాసిని రాజారం. ముంబైలో పుట్టిన స్నేహ దుబాయ్‍లో పెరిగింది. స్నేహను చూసిన డైరెక్టర్ పాజిల్ మాలీవుడ్ ఇండస్ట్రీ దర్శకులకు రికమండ్ చేశారు. దీంతో స్నేహ ముందుగా 2000 సంవత్సరంలో మలయాళీ చిత్రం ఎంగెనా ఒరు నీల పక్షి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

స్నేహ సినిమాలు

2001లో గోపీచంద్ తొలి వలపు మూవీతో టాలీవుడ్ సినిమాల్లోకి అడుగు పెట్టింది స్నేహ. అనంతరం ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మధుమాసం, సంక్రాంతి వంటి ఫ్యామిలీ ఒరియెంటెడ్ చిత్రాలు చేసింది. వీటిలో సంక్రాంతి సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. వెంకీ, రాధాగోపాలం సినిమాలకు కూడా స్నేహకు ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిగా చేస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసింది.

భర్త కంటే ముందుగా

ఇదిలా ఉంటే స్నేహ కోలీవుడ్ యాక్టర్ ప్రస్నన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే స్నేహ రిలేషన్‍షిప్స్ గురించి తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ బయిల్వాన్ రంగనాథన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. "ప్రసన్న కంటే ముందే సినీ నటి స్నేహ ఓ ప్రముఖ నిర్మాతతో ప్రేమలో పడింది. అతను మరెవరో కాదు నిర్మాత నాగ్ రవి. వీరి ప్రేమ ఒక దశకు చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డైమండ్ రింగ్స్ మార్చుకుని ఎంగేజ్‍మెంట్ కూడా చేసుకున్నారు" అని బయిల్వాన్ రంగనాథన్ తెలిపారు.

ఇద్దరు పిల్లలు

"నిశ్చితార్థం తర్వాత ప్రియుడు నిర్మాత నాగ్ రవిపై స్నేహకు అనుమానాలు కలిగాయి. అతను మంచివాడు కాదని, ఫేక్ అని ఆమె భావించింది. దాంతో నిర్మాతతో ఎంగేజ్‍మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. ఇక పెళ్లి అంటే ఇష్టం లేని స్నేహ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడింది. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు" అని రంగనాథన్ అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ తమిళ ఇండస్ట్రీలో సెన్సేషనల్ అవుతున్నాయి.

Whats_app_banner