Tamanna: 2 కోట్లకు మించి ఇస్తే మొత్తం చూపిస్తుంది.. తమన్నాపై షాకింగ్ కామెంట్స్-bayilvan ranganathan about tamannaah bhatia remuneration and bed room scenes of lust stories 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bayilvan Ranganathan About Tamannaah Bhatia Remuneration And Bed Room Scenes Of Lust Stories 2

Tamanna: 2 కోట్లకు మించి ఇస్తే మొత్తం చూపిస్తుంది.. తమన్నాపై షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 05, 2023 10:37 AM IST

Bayilvan Ranganathan On Tamannaah: సౌత్ ఇండియన్ మిల్కీ బ్యూటి ఇటీవల సినిమాలు, వెబ్ సిరీసులతో మంచి జోరు మీద ఉంది. ముఖ్యంగా వెబ్ సిరీసుల్లో ఘాటు సన్నివేశాల్లో నటించి ఎన్నడూ కనిపించని విధంగా హాట్ షో చేసింది. ఈ నేపథ్యంలోనే తమన్నా పారితోషికం, గ్లామర్ షోపై నటుడు బయిల్వాన్ రంగనాథన్ కామెంట్స్ చేశాడు.

తమన్నాపై షాకింగ్ కామెంట్స్
తమన్నాపై షాకింగ్ కామెంట్స్

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు యువతలో చిరస్థాయిగా క్రష్ ముద్ర వేసుకుంది బ్యూటిఫుల్ తమన్నా (Tamannaah Bhatia). మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగులోకి పరిచయమైనప్పటికీ హ్యాపీ డేస్ తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులో మధుగా యూత్ గుండెల్లో గూడు కట్టుకుంది. అనంతరం తెలుగు, తమిళం వంటి సౌత్ సినిమాలతోనే కాకుండా హిందీలోను తన సత్తా చాటుతూ హీరోయిన్‌గా దూసుకుపోయింది తమన్నా. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి కలిసి నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‍ సంపాదించుకుంది.

ట్రెండింగ్ వార్తలు

అలాంటి సన్నివేశాలు

కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా, ఆగడు, బాహుబలి, బెంగాల్ టైగర్, సైరా నరసింహా రెడ్డి ఇలా ప్రతి ఒక్క తెలుగు హీరోతో జోడీ కట్టి ఆడిపాడింది తమన్నా. ఇటీవల భోళా శంకర్, జైలర్ సినిమాలతో థియేటర్లలో సందడి చేసింది. అలాగే ప్రస్తుతం ఆఖరి సచ్ అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‍లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తమన్నా ఇటీవల చేసిన ఓటీటీ వెబ్ సిరీసులు తెగ ట్రెండ్ అయ్యాయి. అందుకు కారణం అందులో తమన్నా ఘాటు శృంగారభరిత సన్నివేశాల్లో నటించడమే.

ప్రియుడి కోసం

అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన జీ కర్దా వెబ్ సిరీసులో సూపర్ హాట్ బెడ్ రూమ్ సీన్స్ చేసింది తమన్నా. అలాగే లస్ట్ స్టోరీస్ 2 సిరీసులో ప్రియుడు విజయ్ వర్మతో అంతకుమించిన ఘాటు సన్నివేశాలతో రెచ్చిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. అంతేకాకుండా 17 ఏళ్ల కిస్సింగ్ రూల్‍ను సైతం ప్రియుడి కోసం బ్రేక్ చేసి ముద్దు సీన్లలో యువతకు పిచ్చెక్కించింది మిల్కీ బ్యూటి. అలాంటి సన్నివేశాల్లో నటించినందుకు తమన్నా భారీగా పారితోషికం తీసుకుందని ఫిల్మ్ జర్నలిస్ట్, నటుడు బయిల్వాన్ రంగనాథన్ కామెంట్స్ చేశాడు.

6 నిమిషాలు అటు ఇటూ

అనేక చిత్రాల్లో నటించిన బయిల్వాన్ రంగనాథన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ తారలపై కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీసుల్లోని బెడ్ రూమ్ సన్నివేశాల్లో తమన్నా నటనపై మాట్లాడారు. "లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా చేసిన ముద్దు సన్నివేశాన్ని 6 నిమిషాల పాటు అటూ ఇటూ చూపించారు. సాధారణంగా తమన్నా ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు తీసుకుంటుంది. కానీ, లస్ట్ స్టోరీస్ 2లో బెడ్ రూమ్ సీన్స్ కోసం రూ. 7 కోట్లు తీసుకుంది. రూ. 2 కోట్లకుమించి ఇస్తే చూపించకూడనివన్నీ చూపిస్తుంది" అని బయిల్వాన్ రంగనాథన్ అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.