మలయాళం ఇండస్ట్రీలో ఏడాదికి సగటున నాలుగైదు సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హిట్స్ అందించే నటుడు బేసిల్ జోసెఫ్. కామెడీతోపాటు ఎమోషనల్ సీన్లలోనూ అద్భుతంగా నటించే అతడు.. ఈ ఏడాది ఇప్పటికే మూడు మూవీస్ చేశాడు. అందులో పొన్‌మ్యాన్, ప్రవీంకూడు షాప్పు ఇప్పటికే ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఆ మూవీ పేరు మరణమాస్.
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో డార్క్ కామెడీ హిట్ మూవీ మరణమాస్ (Maranamass). ఈ ఏడాది బేసిల్ జోసెఫ్ నటించిన మూడో సినిమా ఇది. ప్రముఖ మలయాళ నటుడు టొవినో థామస్ నిర్మాతగా ఈ మూవీని నిర్మించాడు. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.20 కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
విషు పండగ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. వచ్చే నెలలో సోనీ లివ్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. శివప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మరణమాస్ మూవీ మే 15 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బేసిల్ జోసెఫ్ తోపాటు సురేష్ కృష్ణ, రాజేష్ మాధవన్, సిజు, అనిష్మా అనిల్ కుమార్ లాంటి వాళ్లు నటించారు.
మరణమాస్ మూవీలో లూక్ పీపీ అనే పాత్రలో బేసిల్ జోసెఫ్ నటించాడు. ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఒక రాత్రి అనుకోకుండా ఆ సీరియల్ కిల్లర్ తోపాటు ఓ శవం ఉన్న బస్సులో కొందరు వ్యక్తులు చిక్కుకుంటారు. ఆ బాడీని వాళ్లు ఏం చేస్తారు? ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకుంటారన్నది ఈ మూవీ స్టోరీ. ఈ సినిమాలో బేసిల్ జోసెఫ్ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా నటించాడు.
ఓ అమ్మాయి తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఇక అదే ఊళ్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని వాళ్లను చంపి నోళ్లలో అరటిపండ్లు పెడుతూ ఉంటాడు ఓ సీరియల్ కిల్లర్. పోలీసులు ఆ కిల్లర్ కోసం వెతుకుంటాడు. అనుకోకుండా ఆ కిల్లర్, ఓ బాడీ, ఇతర వ్యక్తులు రాత్రిపూట బస్సులో చిక్కుకుపోతారు. తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడొచ్చు.
మలయాళంలో బేసిల్ జోసెఫ్ ఈ మధ్యకాలంలో దూకుడుగా వెళ్తున్నాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ చాలా వరకు హిట్స్ కొడుతున్నాడు. అతడు గతేడాది గురువాయూర్ అంబలనడియిల్, నూనాక్కుజి, సూక్ష్మదర్శినిలాంటి సినిమాలతో హిట్ కొట్టగా.. ఈ ఏడాది పొన్‌మ్యాన్, ప్రవీంకూడు షాప్పుతో మరో రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మరణమాస్ కూడా మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం అతడు పరాశక్తి అనే మూవీలో నటిస్తున్నాడు.
సంబంధిత కథనం