Anthology OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మలయాళం ఆంథాలజీ మూవీ - నాలుగు కథలు - నలుగురు దర్శకులు
OTT: బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన మలయాళం ఆంథాలజీ మూవీ మధురం జీవామృతబిందు థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. సైనా ప్లే ఓటీటీలో ఈ కామెడీ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఆంథాలజీ మూవీలో లాల్, సుహాసిణి మణిరత్నం, సైజు కురుప్ ప్రధాన పాత్రల్లో న టిస్తున్నారు.
Anthology OTT: మలయాళంలో డిఫరెంట్ కాన్పెప్ట్‌లతో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు బాసిల్ జోసెఫ్. సూక్ష్మదర్శిని, పొన్‌మాన్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఓ ఆంథాలజీ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
సైనా ప్లే ఓటీటీలో...
మధురం జీవామృతబిందు టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కామెడీ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ ఆంథాలజీ మూవీ టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు రెండు రోజుల్లో వన్ మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. కోరిక, ఇష్టం, సంతోషం లాంటి భావాలను ఈ ఆంథాలజీ మూవీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
టీజర్‌లో సినిమాలపై ఇష్టం ఉన్న లవర్‌బాయ్ పాత్రలో బాసిల్ జోసెఫ్ కనిపించాడు. టీజర్ బీజీఎమ్ మెలోడీయస్‌గా సాగింది. త్వరలోనే ఈ ఆంథాలజీ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు సైనా ప్లే ఓటీటీ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో మధురం జీవామృతబిందు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
నాలుగు కథలు...
ఈ మూవీలో బాసిల్ జోసెఫ్‌తో పాటు లాల్, సుహాసిని మణిరత్నం, సైజు కురుప్, వినయ్ ఫోర్ట్, జాఫర్ ఇడుక్కి, మాలా పార్వతి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నాలుగు కథలతో మధురం జీవామృతబిందు మూవీ తెరకెక్కుతోంది.
నలుగురు దర్శకులు...
ఈ మలయాళం ఆంథాలజీ మూవీని నలుగురు దర్శకులు కలిసి తెరకెక్కించడం గమనార్హం. ప్రిన్స్ జాయ్, జెనిత్ కాచపల్లి, షాము జైబా, అప్పు ఎన్ భట్టాత్రి ఈ మలయాళం సినిమాకు దర్శకత్వం వహించారు. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు తెరకెక్కించారు. ఈ మలయాళం మూవీకి అరుణ్ మురళీధరన్, శ్రీహరి కే నాయర్, సిద్ధార్థ ప్రదీప్ మ్యూజిక్ అందించారు.
సూక్ష్మదర్శినితో...
బాసిల్ జోసెఫ్ హీరోగా గత ఏడాది రిలీజైన సూక్ష్మదర్శిని మూవీ థియేటర్లలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 55 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. ఇటీవలే పొన్‌మాన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. తమిళంలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు బాసిల్ జోసెఫ్. శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న పరాశక్తి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
సంబంధిత కథనం