OTT Malayalam Comedy Movies: మలయాళం స్టార్ హీరోల్లో ఒకడు బేసిల్ జోసెఫ్. ఎక్కువగా కామెడీ సినిమాలే తీసే ఈ యువ నటుడు ఈ మధ్యే పొన్‌మ్యాన్ (Ponman) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జియోహాట్‌స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేస్తోంది. మరి ఈ బేసిల్ నటించిన బెస్ట్ మలయాళం కామెడీ సినిమాలు ఓటీటీలో ఇంకా ఏవి ఉన్నాయో చూడండి.
మలయాళం హీరో బేసిల్ జోసెఫ్ నటించిన సినిమాలు ఎక్కువగా ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్, సోనీ లివ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
ఇదో భిన్నమైన స్టోరీ. ఇందులో రాజేష్ అనే ఓ పౌల్ట్రీ వ్యాపారం చేసే వ్యక్తిగా బేసిల్ జోసెఫ్ నటించాడు. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను తన తీరుతో చిత్రహింసలు పెడుతుంటాడు. అయితే సడెన్ గా ఓరోజు ఆమె ఎదురు తిరిగి అతన్ని చితగ్గొడుతుంది. తర్వాత రోజూ అతనికి అదే గతి. ఆమె నుంచి రాజేష్ ఎలా తప్పించుకున్నాడన్నదే ఈ కామెడీ మూవీలో చూడొచ్చు.
బేసిల్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ నూనక్కుజి. అంటే అబద్ధాలు చెప్పేవాడు అని అర్థం. ఈ మూవీ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇందులో ఎబీ అనే పాత్రలో బేసిల్ నటించాడు. ఓ పెద్ద కంపెనీపై ఐటీ రెయిడ్ జరిగి, ఆ సంస్థ ఎండీకి చెందిన ల్యాప్‌టాప్ అధికారులు తీసుకెళ్తారు. అందులో తనకు చెందిన ఓ ప్రైవేట్ వీడియో ఉంటుంది. ఆ తర్వాత సినిమా మొత్తం ట్విస్టులు, నవ్వులే.
బేసిల్ జోసెఫ్ తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించిన కామెడీ మూవీ ఇది. తన మాజీ ప్రేయసిని పెళ్లి చేసుకున్న వ్యక్తి చెల్లితోనే పెళ్లికి సిద్ధమయ్యే వ్యక్తి పాత్రలో బేసిల్ నటించాడు. ఆ పెళ్లిని తప్పించుకోవడానికి అతడు పడే పాట్లు, క్లైమ్యాక్స్ బాగా నవ్విస్తాయి.
ఓ యానిమేటర్ గా పని చేసే వ్యక్తి సడెన్ గా పశుగ్రాసం ఇన్‌స్పెక్టర్ గా మారితే ఎలా ఉంటుందన్నది ఈ పాల్తు జాన్వర్ మూవీలో చూడొచ్చు. తనకు ఇష్టం లేకపోయినా ఈ ఉద్యోగం చేస్తూ.. తర్వాత అవే జంతువులకు అతడు ఎలా దగ్గరవుతాడన్నది ఈ సినిమాలో చూపించారు.
బేసిల్ జోసెఫ్ నటించిన మరో కామెడీ థ్రిల్లర్ మూవీ ఈ సూక్ష్మదర్శిని. నవ్విస్తూనే ఓ హత్య చుట్టూ తిరిగే థ్రిల్లర్ మూవీ ఇది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఎంకిలుమ్ చంద్రికే మూవీ చంద్రికే అనే ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. మరో నటుడు సూరజ్ వెంజరమూడు కూడా నటించిన సినిమా ఇది.
సంబంధిత కథనం