Banita Sandhu: గూఢచారి సీక్వెల్‌లో బనితా సంధు హీరోయిన్ - ఈ లండన్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
Banita Sandhu: అడివిశేష్ గూఢచారి 2లో బనిత సంధు హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. హాలీవుడ్‌లో సినిమాలు చేసిన ఈ లండన్ బ్యూటీ గూఢచారి 2 తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
Banita Sandhu: గూఢచారి సీక్వెల్‌లో అడివిశేష్‌కు జోడీ దొరికేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌లో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని సోమవారం చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. లండన్‌లో పుట్టిపెరిగిన బనితా సంధు బాలీవుడ్ మూవీ అక్టోబర్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో సౌత్ ఇండస్ట్రీలో తొలి అడుగువేసింది.
బాలీవుడ్, సౌత్ సినిమాలతో హాలీవుడ్‌లో ఎటర్నల్ బ్యూటీ, మథర్ థెరిస్సా అండ్ మీ అనే సినిమాలు చేసింది. తాజాగా గూఢచారి సీక్వెల్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.గూఢచారి 2 సినిమాకు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తోన్నాడు.
స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో పాన్ ఇండియన్ లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా గూఢచారి 2 సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఈ సీక్వెల్ మూవీనీ టీవీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తోన్నారు.
కాగా 2018లో రిలీజైన గూఢచారి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో అడివి శేష్ నటన, కథలోని మలుపులు ప్రేక్షకుల్ని థ్రిల్లింగ్‌కు గురిచేశాయి. గూఢచారి సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. ఆరు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గూఢచారి 25 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
టాపిక్