Meera Chopra Marriage: వివాహం చేసుకున్న పవర్ స్టార్ హీరోయిన్
Meera Chopra - Rakshit Kejriwal Marriage: హీరోయిన్ మీరా చోప్రా వివాహం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బంగారం చిత్రంలో ఈమె హీరోయిన్‍గా నటించారు. రక్షిత్ కేజ్రీవాల్‍తో ఆమె ఏడడుగులు వేశారు.
Meera Chopra Wedding: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బంగారం (2016) సినిమాలో హీరోయిన్‍గా మీరా చోప్రా హీరోయిన్‍గా చేశారు. ఆ చిత్రంలో సంధ్య పాత్రలో హుషారుగా నటించి మెప్పించారు. వాన చిత్రంతో మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో మరిన్ని చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆ మీరా చోప్రా వివాహం చేసుకున్నారు. రక్షిత్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడారు. ఆ వివరాలివే..
జైపూర్‌లో..
మీరా చోప్రా, రక్షిత్ కేజ్రీవాల్ వివాహం జైపూర్ వేదికగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మంగళవారం ఈ పెళ్లి వేడుక గ్రాండ్‍గా జరిగింది. బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా.. మీరాకు కజిన్లు. చోప్రా కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే, ప్రియాంక చోప్రా రాలేదు. తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మీరా.
ప్రతీ జన్మ నీతోనే అంటూ..
వివాహ వేడుకలో రెడ్ కలర్ డిజైనర్ లెహెంగాలో మీరా చోప్రా మరింత అందంగా కనిపించారు. వైట్ కలర్ షేర్వాణీ ధరించారు రక్షిత్ కేజ్రీవాల్. తమ వివాహ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో ఇద్దరూ పోస్ట్ చేశారు. దండలు మార్చుకున్న ఫొటోలు చూడముచ్చటగా ఉన్నాయి. అతిధులు వారిపై పూల వర్షం కురిపించిన ఫొటోలు కూడా షేర్ చేశారు. “ఇప్పటి నుంచి ఎప్పుడూ ఆనందం, గొడవలు, నవ్వులు, కన్నీళ్లు.. జీవితాంతం జ్ఞాపకాలు. ప్రతీ జన్మ నీతోనే” అని రక్షిత్ కేజ్రీవాల్‍ను ఉద్దేశించి క్యాప్షన్ రాశారు మీరా చోప్రా.
మీరా చోప్రా, రక్షిత్ వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది సెలెబ్రెటీలు, సినీ అభిమానులు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇద్దరి జోడీ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మీరా, రక్షిత్ వివాహ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మార్చి 11వ తేదీనే మొదలయ్యాయి. మెహందీ, సంగీత్ ఫంక్షన్లు ఘనంగా జరిగాయి. మార్చి 12న వివాహం అట్టహాసంగా జరిగింది. గౌరవ్ చోప్రా, అర్జున్ బాజ్వా, మధుర్ భండార్కర్, ఆనంద్ పండిట్, ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా సహా మరికొందరు సెలెబ్రెటీలు హాజరయ్యారు.
మీరా చోప్రా కెరీర్
అన్బే ఆరుయిరే అనే తమిళ చిత్రంతో 2005లో తెరంగేట్రం చేశారు మీరా చోప్రా. ఆ తర్వాతి సంవత్సరమే బంగారం సినిమాలో పవన్ కల్యాణ్‍కు జోడీగా నటించారు. దీంతో పాపులర్ అయ్యారు. జంభవన్, లీ సహా మరో రెండు తమిళ చిత్రాలు చేశారు. 2008లో తెలుగు వాన చిత్రంలో హీరోయిన్‍గా నటించారు మీరా. మ్యూజికల్ హిట్ అయిన ఆ చిత్రంలోనూ నటనతో మెప్పించారు. ఆ తర్వాత తెలుగులో మారో, గ్రీకు వీరుడు చిత్రాల్లో చేశారు మీరా. ఆమె నటించిన చివరి తెలుగు సినిమా గ్రీకు వీరుడు. ఆ తర్వాత తమిళం, హిందీ చిత్రాలు చేస్తున్నారు. మీరా చోప్రా చివరగా గతేడాది సఫేద్ అనే హిందీ చిత్రంలో కనిపించారు. ఆ చిత్రం జీ5 ఓటీటీలో రిలీజ్ అయింది.
టాపిక్