Veera Simha Reddy Tv Premiere: వీర‌సింహారెడ్డి టీవీ ప్రీమియ‌ర్ డేట్ ఫిక్స్ - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుందంటే-balakrishna veera simha reddy tv premiere date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Balakrishna Veera Simha Reddy Tv Premiere Date Locked

Veera Simha Reddy Tv Premiere: వీర‌సింహారెడ్డి టీవీ ప్రీమియ‌ర్ డేట్ ఫిక్స్ - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుందంటే

బాల‌కృష్ణ
బాల‌కృష్ణ

Veera Simha Reddy Tv Premiere: బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమా టీవీ ప్రీమియ‌ర్ డేట్ ఖ‌రారైంది. ఈ సినిమా ఏ రోజు ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుందంటే..

Veera Simha Reddy Tv Premiere: థియేట‌ర్‌తో పాటు ఓటీటీలోనూ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన‌ బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమా టీవీలోకి రాబోతున్న‌ది. ఏప్రిల్ 23న స్టార్ మాలో ఈ సినిమా టెలికాస్ట్ కానుంది. సాయంత్రం 5.30 గంట‌ల‌కు ఈ ప్రీమియ‌ర్ ప్రారంభ‌మ‌వుతోంద‌ని స్టార్ మా ప్ర‌క‌టించింది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి యాక్ష‌న్ అంశాల‌ను జోడించి రూపొందించిన ఈ సినిమాలో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించాడు.

ట్రెండింగ్ వార్తలు

వీర‌సింహారెడ్డి అనే ఫ్యాక్ష‌న్ లీడ‌ర్‌గా, జై సింహా అనే యువ‌కుడిగా రెండు ప‌వ‌ర్ ఫుల్ రోల్స్‌లో క‌నిపించాడు. గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కించారు. బాల‌కృష్ణ క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు యాక్ష‌న్ ఘ‌ట్టాలు థియేట‌ర్ల‌లో ఆడియెన్స్‌ను అల‌రించాయి. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

బాల‌కృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గ‌త నెల డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమా హ‌య్యెస్ట్ వ్యూయ‌ర్‌షిప్ ద‌క్కించుకొని రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా టీవీలో ఫ‌స్ట్ ప్రీమియ‌ర్ టెలికాస్ట్ కానుండ‌టంతో టీఆర్‌పీ ప‌రంగా బాల‌కృష్ణ గ‌త సినిమాల రికార్డుల‌ను వీర‌సింహారెడ్డి అధిగ‌మించే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తోన్నారు.

వీర సింహా రెడ్డి సినిమాలో శృతిహాస‌న్‌, హ‌నీరోజ్ హీరోయిన్లుగా న‌టించారు. బాల‌కృష్ణ సోద‌రిగా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టించింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.