Veera Simha Reddy Trailer Update: వీరసింహుడి ఉగ్రరూపానికి ముహూర్తం ఫిక్స్.. ట్రైలర్ విడుదలయ్యేది అప్పుడే-balakrishna veera simha reddy trailer release date fix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Balakrishna Veera Simha Reddy Trailer Release Date Fix

Veera Simha Reddy Trailer Update: వీరసింహుడి ఉగ్రరూపానికి ముహూర్తం ఫిక్స్.. ట్రైలర్ విడుదలయ్యేది అప్పుడే

Maragani Govardhan HT Telugu
Jan 05, 2023 09:39 PM IST

Veera Simha Reddy Trailer Update: నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. శుక్రవారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనుంది.

బాలయ్య వీరసింహారెడ్డి
బాలయ్య వీరసింహారెడ్డి

Veera Simha Reddy Trailer Update: నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత ఫుల్ బిజీగా మారారు. ఓ పక్క హీరోగానే చేస్తూ.. మరోపక్క వ్యాఖ్యతగానూ అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్ర వీరసింహారెడ్డి. క్రాక్ లాంటి సూపర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది. వీరసింహారెడ్డి ట్రైలర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది.

వీరసింహారెడ్డి ట్రైలర్‌ను శుక్రవారం అంటే జనవరి 6 సాయంత్రం 8.17 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఒంగోలు వేదికగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టును షేర్ చేసింది.

వీరసింహుడి ఉగ్రరూపం చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందేనంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకురుస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం